ఒకప్పుడు కోటి చదువులు కూటి కోసమే అనేవారు. కానీ ఇప్పుడు కోటి రూపాయలు ఉన్న ఆరోగ్యం కోసమే అనే విధంగా తయారయింది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిసీస్ వేధిస్తోంది. దీనికి ప్రధాన కారణం మనం తినే ఫుడ్ అని చెప్పవచ్చు. మన
న్యూస్ లైన్ డెస్క్: ఒకప్పుడు కోటి చదువులు కూటి కోసమే అనేవారు. కానీ ఇప్పుడు కోటి రూపాయలు ఉన్న ఆరోగ్యం కోసమే అనే విధంగా తయారయింది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిసీస్ వేధిస్తోంది. దీనికి ప్రధాన కారణం మనం తినే ఫుడ్ అని చెప్పవచ్చు. మన పొద్దున లేచి తాగే పాల నుంచి మొదలు తినే ఫుడ్ వరకు అన్నీ కల్తీ అవుతున్నాయి. ఆయు ప్రమాణం తగ్గడమే కాకుండా అనేక రోగాలు బాధిస్తున్నాయి. ముఖ్యంగా కల్తీ ఆహారం వల్ల జీర్ణ సమస్యలు మొదలై ఆ తర్వాత మెల్లిమెల్లిగా శరీరమంతా సమస్య మొదలవుతాయి. మీ జీర్ణ వ్యవస్థ చెడిపోతుందని తెలిపే సాంకేతాలు ఏంటో చూద్దాం..
కడుపు ఉబ్బడం :
ముఖ్యంగా కొంతమందికి ఏది తిన్న కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది. కడుపునొప్పి వేధిస్తుంది. ఏ ఆహారం తిన్న వెంటనే బాత్రూం వెళ్లడం వంటివి లక్షణాలు కనిపిస్తే మీ జీర్ణ వ్యవస్థ ఇబ్బందుల్లో పడ్డట్టే అని వైద్యులు అంటున్నారు. కాబట్టి ఈ సాంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్యులకు చూపించుకుని సరైన చికిత్స చేయించుకోవాలి.
బరువు తగ్గడం:
ముఖ్యంగా పేగుల్లో కొన్ని హితకర బ్యాక్టీరియాల్ చేరినప్పుడు మన శరీర బరువులు అనేక మార్పులు వస్తాయట. ముఖ్యంగా కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలతో మన బరువు పెంచే బ్యాక్టీరియా పేగుల్లో పెరిగిపోతుందట. దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయట.
చర్మ సమస్యలు:
జీర్ణ వ్యవస్థ చెడిపోయింది అంటే తప్పకుండా చర్మ సమస్యలు తత్తుతాయి. దురదలు, సోరియాసిస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే మన ప్లేగుల లీకయ్య కొన్ని ప్రోటీన్లను హానికరమైనదిగా భావించి రోగ నిరోధక శక్తి వాటిపై దాడి చేయడం ప్రారంభిస్తుంది దీనివల్ల ఈ చర్మ సమస్యలు వస్తాయట.
మానసిక ఇబ్బందులు:
ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ గాడి తప్పితే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, వంటి సమస్యలు తలెత్తుతాయి. బ్రో బయోటిక్స్ తో వీటిని కొంతవరకు సెట్ చేయవచ్చు. ఈ సమస్యల నుంచి బయట పడాలి అంటే తప్పకుండా క్రమం తప్పకుండా ఆహారం తినాలి. మద్యానికి దూరం అవ్వాలి. దానికి దూరంగా ఉండాలి. సమయానికి నిద్రపోతూ, ఎక్సర్సైజులు చేయాలని నిపుణులు అంటున్నారు.