డానీష్‌ది ఆత్మహత్య కాదు హత్య అని ఫిర్యాదు అతని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
న్యూస్ లైన్ డెస్క్: కుకట్‌పల్లి(Kukatpally)లో ఘోరం జరిగింది. ప్రేమకు అడ్డు వస్తున్నాడని స్నేహితుడిని ఇంటర్ విద్యార్థి(Inter student) చంపేశాడు. ఈ నెల 23న జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. డానీష్(17)ను అతని స్నేహితులు చంపి రైలు ప్రమాదంగా చిత్రీకరించినట్లు పోలీసు(police)లు తెలిపారు. ఈ నెల 23న మూసాపేట(Moosapet) వద్ద రైలు పట్టాలపై డానీష్ మృతదేహం లభ్యమైనట్లు వెల్లడించారు.
డానీష్‌ది ఆత్మహత్య కాదు హత్య అని ఫిర్యాదు అతని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డానీష్ సెల్‌ఫోన్ కాల్‌డేటా(call data) ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈ నెల 22న రాత్రి 9.30 గంటలకు డానీష్‌కు అతని స్నేహితుడు ఫోన్ చేసినట్లు తేలింది. మత్తులో ఉన్న డానీష్‌పై దాడి 8 మంది స్నేహితులు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ క్రమంలోనే ఓ రౌడీషీటర్ కుమారుడు(17) డానీష్‌ను బీరుసీసాతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం మృతదేహాన్ని రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారు. అయితే, తన ప్రేమకు అడ్డువస్తున్నాడని డానీష్‌పై రౌడీషీటర్ కుమారుడు పగ పెంచుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులను యూసఫ్‌గూడలోని కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నట్లుగా గుర్తించారు.