" జియోస్టార్ " పేరుతో ఓ కొత్త డొమైన్ మార్కట్లోకి రానుంది. అయితే వెబ్ సైట్ కమింగ్ సూన్ మాత్రమే కనిపిస్తుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విలీనం లాస్ట్ కు వచ్చేసింది. రిలయన్స్ , డిస్నీలకు చెందిన ప్లాట్ ఫామ్ లు ఈ రోజే విలీనం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే జియో , డిస్నీ రెండు కలిసి ఒకే స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ గా వస్తాయి. " జియోస్టార్ " పేరుతో ఓ కొత్త డొమైన్ మార్కట్లోకి రానుంది. అయితే వెబ్ సైట్ కమింగ్ సూన్ మాత్రమే కనిపిస్తుంది.
నవంబర్ 14 నుంచి ఈ డొమైన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక నుంచి డిస్నీ+ హాట్‌స్టార్, జియో సినిమాలోని కంటెంట్ అంతా ఒకే చోట దర్శనమివ్వనుంది. అయితే ఐపీఎల్, ఫిఫా వంటి లైవ్ స్పోర్ట్స్ ఈవెంట్లు మాత్రం హాట్‌స్టార్ యాప్‌లోనే ప్రసారం అవుతుందట. ఇదంతా ఎందుకు అంటే ప్రీమియం కంటెంట్ కోసమే ఈ మెర్జ్ అంటున్నారు మార్కెట్ వర్గాలు.జియోహాట్‌స్టార్ పేరుతో కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్ అవతరించబోతోందని వార్తలు రావడం, ఆ డొమైన్ తనదేనంటూ ఓ యాప్ డెవలపర్ ముందుకు రావడం, తన చదువుకయ్యే ఖర్చు మొత్తం రిలయన్సే భరించాలంటూ పేర్కొనడం అందరికీ తెలిసిందే.
ఓ దశలో తక్కువ మొత్తానికే రిలయన్స్‌కు ఇస్తానని పేర్కొని ఒక్కసారిగా ఆ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత యూఏఈకి చెందిన ఇద్దరు చిన్నారులు తెరపైకి వచ్చి ఈ డొమైన్‌ను ఉచితంగా ఇస్తామని తాజాగా ప్రకటించారు.వీటన్నింటికి చెక్ పెడుతూ ఇఫ్పుడు జియో హాట్ స్టార్ డొమైన్ రావడం షాకింగ్ గా ఉంది. ఇక వీటన్నింటికి చెక్ పెడుతూ ..హాట్ స్టార్ ఏం చెబుతుందో చూడాలి.