11 సంవత్సరాలుగా తయారు చేయడం ఆనవాయితీగా వస్తుంది. గోటి తలంబ్రాలంటే ధన్యాన్ని గోటి తీసి బియ్యాన్ని చేస్తారు ఇవే గోటి తలంబ్రాలు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సీతారాముల కళ్యాణం కోసం ముందే భక్తులు రెడీ అవుతున్నారు. రాములోరి తలంబ్రాలను చీరాలలోని రఘురామ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో సిద్ధం చేస్తున్నారు. ఇలా గోటి తలంబ్రాలను ఇక్కడ గడచిన 11 సంవత్సరాలుగా తయారు చేయడం ఆనవాయితీగా వస్తుంది. గోటి తలంబ్రాలంటే ధన్యాన్ని గోటి తీసి బియ్యాన్ని చేస్తారు ఇవే గోటి తలంబ్రాలు.
స్వామి వారి కళ్యాణంలో వాడే వాటికి వీటిలో వినియోగించే ఒక్కో వస్తువుకు ఓ ప్రత్యేకత ఉంది. ముత్యాల తలంబ్రాలు ..గోటి తలంబ్రాలు ఇలా చాలా ఉంటాయి. ప్రతి యేడాది స్వామి వారి కళ్యాణానికి ఈ గోటి తలంబ్రాలు చీరాల నుంచి పంపుతారు. ఆ జానకిరాముని కల్యాణానికి వినియెగించే కోటి గోటి తాలంబ్రాలను సిద్ధం చేసే భాగ్యం దక్కితే ఆ అనుభూతే వేరు కదా. అటువంటి మహత్ కార్యానికి శ్రీకారం చూట్టారు బాపట్ల జిల్లా చీరాల ప్రాంత భక్తులు.
అయితే ఇన్నాళ్లు గోటి తలంబ్రాలు తక్కు మోతాదులో పంపేవారు. అంటే లక్ష అలా...కాని ఈ ఏడాది మాత్రం కోటి తలంబ్రాలను స్వామివారికి పంపాలని సంకల్పించారట. ఆ పనులు ఇప్పటి నుంచే మొదలుపెడుతున్నట్లు భక్త సేవా సమితి తెలిపింది. అయితే 2025 లో ఏప్రిల్ 6 వ తేదీ శ్రీరామ నవమి జరగనుంది. అప్పటికి కోటి గోటి తలంబ్రాలు సిధ్ధం చెయ్యాలని అనుకుంటున్నట్లు తెలిపారు.