Diabetes: భారత్ ను వణికిస్తున్న డయాబెటిస్ ..కోట్ల లో డయాబెటిస్ పేషెంట్లు !

దీని వల్ల ఎలాంటి నొప్పి ఉండదు.. కానీ మీ ఒళ్ళంతా కూడా విషం నింపేస్తుంది. నచ్చిన ఫుడ్ తినలేరు. ఎక్కువగా పని చేయలేరు.


Published Nov 14, 2024 01:16:00 PM
postImages/2024-11-14/1731570485_sugar283ae45b20.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: డయాబెటిస్ ప్రస్తుతం జనాలు వణికిస్తుంది. కనిపించకుండా ...స్లో పాయిజన్ లా మనిషిని చావు అంచులకు తీసుకెళ్తుంది. ఈ వ్యాధితో ప్రస్తుతం భారత్ లో కోట్ల జనం ఇబ్బందిపడుతున్నారు. ఏకంగా పది కోట్ల కుటుంబాలు డయాబెటిస్ తో ఇబ్బందులు పడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. . ఆ కుటుంబాల్లో దాదాపు 40 కోట్లమందిని మానసికంగా వేధిస్తోంది ఈ షుగర్ వ్యాధి. దీని వల్ల ఎలాంటి నొప్పి ఉండదు.. కానీ మీ ఒళ్ళంతా కూడా విషం నింపేస్తుంది. నచ్చిన ఫుడ్ తినలేరు. ఎక్కువగా పని చేయలేరు.


అదే ప్రీ డయాబెటీస్. దేశంలో ఈ స్టేజ్ లో ఉన్నవారు ఎందరో తెలిస్తే.. కచ్చితంగా షాక్ అవుతారు. ఏకంగా 13 కోట్ల 60 లక్షల మంది ఈ స్టేజ్ లో ఉన్నారు. మహారాష్ట్ర లో జనాభా ఎక్కువ . అయితే ఆ రాష్ట్రంలో డయాబెటిక్ పేషెంట్లు దాదాపు 24 కోట్ల మంది. దీన్ని ఇండియాలో షుగర్ పేషెంట్లను అంచనా వెయ్యండి. అసలు ఎందుకు ఇంత మంది డయాబెటిక్ అవుతున్నారు. నిజానికి జనాలకి టైం లేదు. డాక్టర్ల దగ్గర కు వెళ్లడానికి లేదు...శారీరికంగా శ్రమించడానికి కూడా లేదు.
80 శాతం మంది రోగుల్లో 3 స్టేజీల తరువాతే ఈ వ్యాధి ఉన్నట్టు తేలింది. డయాబెటీస్ లో టైప్1, టైప్2 అని రెండు ఉన్నాయి. దేశంలో 90 శాతం మంది టైప్2తో బాధపడుతున్నవారే. దీని లక్షణాలను చూస్తే.. దాహం ఎక్కువగా వేస్తుంది.

ఎక్కువ సార్లు యూరిన్ కు వెళ్లాల్సి ఉంటుంది. నీరసం బాగా పెరిగిపోతుంది. ఆకలి ఎక్కువ అవుతుంది. కంటి చూపు తగ్గుతుంది. ఇంతేకాదు చాలా మంది ఏది అంతగా గుర్తుండదు. గాయాలు మానవు. శరీరం చాలా మెత్తగా ఉంటుంది. ఏదో నొప్పిగా చెప్పలేని నీరసం తో ఏ పని చేసుకోలేరు. డయాబెటిక్ ను కంట్రోల్ చెయ్యలంటే బరువు కంట్రోల్ చేసుకోవాలి. శారీరక శ్రమ కచ్చితంగా ఉండాలి. తగినంత వ్యాయామం చేయాలి. ఏం తిన్నా కానీ తక్కువగా తినాలి. కచ్చితంగా 6 నెలలకు ఒకసారైనా డాక్టర్ ని కలిసి పరీక్షలు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు రాత్రి భోజనం మానేయాలి..లేదా ఆరు గంటలకు ముందే తినాలి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-news healthy-food-habits diabeties diabetes-control

Related Articles