మోహన్ లాల్ కొడుకు కూడా మంచి డైరక్టర్ , రచయిత, గా మెప్పించాడు. కాని ఇప్పుడు సడన్ గా గొర్కెలు కాపరిగా కూలీకి వెళ్తున్నాడు ఎందుకో చూసేద్దాం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సౌత్ ఇండస్ట్రీలో మోహన్ లాల్ తెలియని వారు లేరు. మలయాళం లో సూపర్ స్టార్. కోట్లాదిమంది అభిమానులున్నారు. అయితే ఎన్నో రికార్డులు , కలక్షన్లు సాధించిన మోహన్ లాల్ కొడుకు కూలీ పని చేస్తున్నాడంటే మాత్రం ఎవ్వరు నమ్మరు. నిజానికి మోహన్ లాల్ కొడుకు కూడా మంచి డైరక్టర్ , రచయిత, గా మెప్పించాడు. కాని ఇప్పుడు సడన్ గా గొర్కెలు కాపరిగా కూలీకి వెళ్తున్నాడు ఎందుకో చూసేద్దాం.
అతడే ప్రణవ్ మోహన్ లాల్. సినీరంగంలో హీరోగా, దర్శకుడిగా, రచయితగా సంచలనాలు సృష్టించాడు. అయితే పాన్ ఇండియా స్టార్ హీరోగా మారతాడనుకున్న ప్రణవ్.. కోట్ల ఆస్తిని, సినీరంగాన్ని వదిలేసి సామాన్యుడిగా జీవిస్తున్నాడు. కోట్లు ఆస్తి , బాలనటుడిగి ఇండస్ట్రీలో హిట్లు చూశాడు. స్క్రీన్ ప్లే రైటర్ గా మంచి హిట్లు కూడా అందుకున్నాడు . కొన్నాళ్లు హీరోగా మెరిశాడు. హృదయం సినిమాతో రికార్డ్స్ క్రియేట్ చేశాడు . తెలుగులో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రణయ్ 7 ఏళ్లలో కేవలం 5 సినిమాల్లోనే నటించాడు. ప్రతి సినిమా పూర్తయిన తర్వాత ఏదో ఒక ఊరికి వెళ్లడం ఆయనకు అలవాటు. అనుభవం కోసం అలా చేస్తాడు. ఇటీవల స్పెయిన్ వెళ్లిన ప్రణవ్.. అక్కడ కూలీ పని చేస్తున్నాడు. అక్కడ ఓ ఫామ్ హౌస్ లో ఉంటూ గొర్రెలు, గుర్రాల కాపరిగా చేరాడట. ఇందుకు జీతం తీసుకోవడం లేదు. కానీ భోజనం, షెల్టర్ ఇస్తారట.