భారత్‌కు వచ్చింది. ఈమె బెంగుళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని టెర్మినల్ 2లో దిగింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇండియా కి వచ్చిన ఓ జపాన్ టూరిస్ట్ ...షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది. ఇండియాకు జపాన్ నుంచి ఓ టూరిస్ట్ వచ్చింది. అయితే రావడం రావడం బెంగుళూరు కెంపేగౌఢ ఎయిర్ పోర్ట్ లో దిగింది. అయితే అక్కడ ఎయిర్ పోర్ట్ చూసి వ్లాగర్ కికీ చెన్ షాక్ అయ్యారు..ఇంత అందంగా ఉంటుందనుకోలేదని తెలిపారు. అంతేకాదు ..జపాన్ కూడా ఇలానే ఉంటుందని తెలిపింది.
జపాన్‌కు చెందిన ఓ ట్రావెల్ వ్లాగర్ కికీ చెన్ ఓ యువతి.. భారత్‌కు వచ్చింది. ఈమె బెంగుళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని టెర్మినల్ 2లో దిగింది. అక్కడ చేసిన డిజైన్స్‌కి కికీ చాలా ఇంప్రెస్ అయ్యింది . ఈ ఎయిర్ పోర్ట్ చాలా బావుంది. అంటూ ఎయిర్ పోర్టులో ఉండే ప్లేసులన్నీ చూపించింది కికీ. అంతే కాకుండా అక్కడ కొన్ని రకాల ఫొటోలు కూడా దిగింది. ఈ వ్లాగ్ కు లక్షల్లో లైకులు , షేర్లు వస్తున్నాయి. అంతేకాదు జపాన్ లోను ఈ వ్లాగ్ హై స్పీడ్ లో వైరల్ అవుతుంది .
బెంగుళూరుకు చెందిన ఈ విమానాశ్రయానికి ‘టెర్మినల్ అవార్డు’ వచ్చిందని ఒక నెటిజన్ కామెంట్ చేయగా’.. ‘బెంగుళూరు ఎయిర్ పోర్టు వల్ల ఇతర దేశ ప్రజలు కూడా మనల్ని అభినందించడం గర్వ కారణం.. కాబట్టి మన గర్వ పడాలంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు ...తిరిగి ఏదోక ఎయిర్ పోర్ట్ కి వెళ్తే ..గలీజ్ ఉందని కూడా ఇలానే వీడియోలు పెడతారంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.