Kangana Ranaut: ఇందిరాగాంధీ కి ఉన్నంత బంధుప్రీతి మరెవ్వరికి లేదు !

ఇందిరా గాంధీ ఎంతో పేరు ప్రఖ్యాతులున్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారని, దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె అని పేర్కొన్నారు. 


Published Jan 08, 2025 04:09:00 PM
postImages/2025-01-08/1736332876_17206095420151.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బాలీవుడ్ నటి , బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తాజాగా ఇందిరాగాంధీ కుటుంబం , బంధుప్రీతి లాంటి విషయాలపై స్పందించారు. బంధుప్రీతికి సరైన నిదర్శనం ఇందిరాగాంధీయేనని అన్నారు. బంధుప్రీతి  కారణంగానే ఇందిర రాజకీయాల్లోకి రాగలిగారని కంగనా చెప్పారు.ఇందిరా గాంధీ ఎంతో పేరు ప్రఖ్యాతులున్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారని, దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె అని పేర్కొన్నారు. 


ఫ్యామిలీ  నేపథ్యం కారణంగా పార్టీలో కీలకవ్యక్తిగా ఎదిగారు. ముఖ్యమైన మంత్రత్వ శాఖలన్నింటినీ తన దగ్గరే అట్టిపెట్టుకున్నారు. కంగన రీసెంట్ గా ఎమర్జెన్సీ అనే పొలిటికల్ రాజకీయ కథా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమె ఇందిరాగాంధీగా నటిస్తున్నారు.ఈ చిత్ర ప్రమోషన్స్ తో కంగనా బిజీగా ఉన్నారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆమె ఇందిరాగాంధీపై వ్యాఖ్యలు చేశారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news kanganaranaut indira-gandi

Related Articles