కిచ్చా సుదీప్ తల్లి సరోజా సంజీవ్ ఆదివారం ( అక్టోబర్ 20న) కన్నుమూశారు. ఆమె మరణం తో సుదీప్‌కు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బిగ్ బాస్ షూట్ కి వెళ్లే ముందు నన్ను కౌగిలించుకున్న మా అమ్మ ఆ తర్వాత చాలా తక్కువ టైంలోనే నాకు దూరంగా వెళ్లిపోయింది. ఇది నాకు లైఫ్ అంతా గుర్తుండిపోయే విషయం మా అమ్మ నాకు ఇచ్చిన కౌగిలి. నిన్నటి వరకు అమ్మనాకు అధ్భుతం ఈ రోజు నుంచి తను నాకు ఓ అందమైన జ్ఞాపకం..అంటూ తన తల్లిపై తనకున్న ప్రేమను తెలిపారు కిచ్చా సుదీప్.
కిచ్చా సుదీప్ తల్లి సరోజా సంజీవ్ ఆదివారం ( అక్టోబర్ 20న) కన్నుమూశారు. ఆమె మరణం తో సుదీప్‌కు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. తల్లి దగ్గర కిచ్చా సుదీప్ చాలా ఏడ్చేశారు. ఆమె నా గురువు, నా నిజమైన శ్రేయోభిలాషి, నా మొదటి అభిమాని. కానీ ఇప్పుడు మా అమ్మ అందమైన జ్ఞాపకం మాత్రమే’. ‘ప్రస్తుతం నేను పడుతున్న ఆవేదనను వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. జరిగిన దాని గురించి నేను వ్రాయలేను. 24 గంటల్లో అంతా మారిపోయింది’ నువ్వు లేకుండా రోజులు ముందుకు ఎలా వెళ్తాయో నాకు తెలీదు అంటూ కంమెంట్ చేశారు.
మా అమ్మకు హెల్త్ బాలేదని తెలిసినపుడే కన్నడ బిగ్ బాస్ శనివారం షూట్ జరుగుతుంది. అలానే షూట్ కంప్లీట్ చేశాను. అయితే వెంటిలేటర్ పై ఉన్నపుడు అమ్మను ఒక్కసారి చూసి ఉంటే బాగుండేది . కాని చూడలేదు..తిరిగి ఇంటికి వచ్చేసరికి అమ్మే లేదు. ఎంత కాలం ఏడ్చినా తీరని బాధ ఇది అంటూ ...చాలా ఎమోషనల్ అయ్యారు .