హిందూసంప్రదాయంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కుభేరుడికి భక్తులు ఉన్నారు. అయితే ఈ రోజు పూజ విధానం కుభేరుడిని పూజిస్తారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దీపావళి అమావాస్య కు ముందు కుభేరుని పూజించడం ఆనవాయితీ. కుభేరుని పూజంచకుండా చేసే ధన్ తేరస్ పూజ అసంపూర్ణం అని శాస్త్రవచనం. హిందూసంప్రదాయంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కుభేరుడికి భక్తులు ఉన్నారు. అయితే ఈ రోజు పూజ విధానం కుభేరుడిని పూజిస్తారు.
సంపదలకు అధిదేవత అయిన కుభేరుడు గత జన్మలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకొని ఉంటాడని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కాని గత జన్మలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకొని ఉంటాడని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కాని గత జన్మలో కుభేరుడు దొంగతనం చేసిన ప్రయత్నించి మరణంచిన వ్యక్తి ఇలాంటి వ్యక్తి సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడో చూద్దాం.
కుబేరుడు గత జన్మలో గుణనిధి పేరుతో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి. పుట్టడం బ్రాహ్మణ కుటుంబంలో అయినా చెడు సావాసాల కారణంగా జూదం ఆడేవాడు. జూదం ఆడటంలో భాగంగా తమ తల్లిదండ్రులు, తమ తాతలు సంపాదించిన ధనాన్ని మొత్తం జూదంలో పోగొట్టాడు. తన తల్లి తన కొడుకు చేస్తున్న పనులను సమర్ధిస్తూ కప్పి పుచ్చుకుంటూ ఉండేది.గుణనిధి చేసే పనులు ఆయన తండ్రికి తెలియనివ్వకుండా ఆమె జాగ్రత్తపడింది. అయితే తండ్రికి నిజం తెలియడంతో గుణనిధి భయపడ్డాడు. ఇంటి నుంచి పారిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడు. గుణనిధి ఆకలి దాహంతో ఉంటాడు. చీకటిగా ఉందంటు తన పంచె చింపి దీపం పెడతాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటకి నడుస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి, ఆ ప్రయత్నంలో జరిగిన తొక్కిసలాటలో గుణనిధి ప్రాణాలు కోల్పోతాడు.
మరణించిన గుణనిధి ఆత్మను తీసుకెళ్లడానికి యమదూతలు వస్తారు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై గుణనిధితో నువ్వు ఎన్నో పాపాలు చేసినా మహాశివరాత్రి పర్వదినం రోజున నా ఆలయంలోని దీపం ఆరిపోకుండా కాపాడావు. ఇవన్నీ అనుకోకుండా చేసినా శివరాత్రి పర్వదినాన చనిపోవడతో గుణనిధికి కైలాస్ ప్రాప్తి లభించి కుభేరుడిగా జన్మిస్తాడు.
ఆ బ్రాహ్మణ జన్మ తరువాత కుబేరుడు తదుపరి జన్మలో విశ్రవసుడు, దేవవర్ణినిలకు కుమారుడిగా జన్మించాడు. వారు తమ పుత్రుడికి వైశ్రవణగా నామకరణం చేశారు. వైశ్రవణుడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెట్టాడు. ఆ తరువాత అతను యక్షులకు రాజుగా, దిక్కులకు రక్షకుడిగా, సంపదలకు అధిదేవతగా పేరు పొందాడు. ఇదీ కుబేరుడి కథ. ఏడాదికి ఒకసారి ధనత్రయోదశి ..రోజు కుభేరుడు కి పూజలు చేసి సంపదకు పూజలు జరిపిస్తారు.