సింహాం అటాక్ చేస్తే అనే భయం లేకుండా ఎంత స్మార్ట్ గా నడుచుకొని వెళ్తుందో చూడండి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సింహాం అడవికి రాజు..రాజుని చూసి అడవి జంతువులంతా బయపడిపోతాయి. మనకి తెలిసిన అడవి ఇదే. కాని అడవి అంటే ఆకలి ...ఆకలి అంటే వేట ..వేట అంటే చావు...చావు అంటే ధైర్యం ఇవే అడవి ధర్మాలు. బలమున్న జంతువు ఆకలికి బలం లేని జంతువు బలి కావాల్సిందే. కాని అడవి లో ప్రతి జంతువు ..ప్రతి జంతువుకి భయపడుతుంది. అడవికి రారాజు కూడా భయపడితీరాల్సిందే.
ఏ జంతువులకు భయపడకుండా.. ఎక్కడపడితే అక్కడ స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి. ఆకలి లేకుండా జంతువు ను వేటాడవు. ఇదే మొదటి అడవి నియమమట. ఎంత పెద్ద జంతువు ఎదురైనా.. కొంచెం కూడా జంకకుండా తన వేటను తను చేస్తూ ఉంటాయి. దేనితో అయినా సరే పోరాడేందుకు వెనకాడవు. అయితే ఈ అడవి ధర్మాన్ని ఫాలో అవుతూ సింహాలు.. పక్కకు వెళ్లి...ఖడ్గ మృగాలకు దారిచ్చిన వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.
వీడియోలో మీరు రెండు సింహాలు ఓ ప్రాంతంలో కూర్చుని ఉన్నాయి. అదే సమయంలో రెండు ఖడ్గమృగాలు అటుగా వచ్చాయి. వాటిని చూసిన సింహాలు వెంటనే లేచి పక్కకు వెళ్లిపోయాయి. ఖడ్గమృగాలు కాసేపు అదే ప్రాంతంలో ఉండటంతో.. రెండు మగ సింహాలు తోక ముడిచి అక్కడి నుంచి జారుకున్నాయి. సింహాం అటాక్ చేస్తే అనే భయం లేకుండా ఎంత స్మార్ట్ గా నడుచుకొని వెళ్తుందో చూడండి.
దీనికి కూడా పెద్ద రీజన్ ఉందండోయ్..ఖడ్గమృగానికి ముక్కు దగ్గర పెద్ద కొమ్ము ఉంటుంది. దీనితోనే ..ఎంత పెద్ద జంతువునైనా ఫస్ట్ ఆ కొమ్ముతోనే అటాక్ చేస్తుంది. దీనికి భయపడే సింహాలు సైడ్ కు తప్పుకుంది. ‘సింహం పిరికి కాదు కానీ తెలివైనది, అది అనవసరంగా పోరాడదని కొందరు కామెంట్ చేస్తున్నారు.
So does this make Rhino the King of the jungle then? pic.twitter.com/e4ok6lNLGS — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 26, 2024