తెలంగాణ పోలీస్ స్టేషన్లలో M టాక్స్..?

రాష్ట్రంలో పథకాల అమలుకే కాదు.. పోలీసు శాఖలో ఖర్చులకు కూడా డబ్బులు దొరకడం లేదట. దీంతో అప్పుడెప్పుడో మరిచిపోయిన ఓ కొత్త ట్యాక్స్ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి


Published Oct 01, 2024 08:15:00 PM
postImages/2024-10-01/1727793122_matax.jpg

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో పథకాల అమలుకే కాదు.. పోలీసు శాఖలో ఖర్చులకు కూడా డబ్బులు దొరకడం లేదట. దీంతో అప్పుడెప్పుడో మరిచిపోయిన ఓ కొత్త ట్యాక్స్ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో... ఎవరు పోలీస్ స్టేషన్ కు వచ్చినా.. మెయింటనెన్స్ పేరుతో ఎంతో కొంత వసూలు చేసేవారట పోలీసు సిబ్బంది. లోకల్ లీడర్లు సైతం తమకు తోచినంత సమర్పించుకునే వారనే ప్రచారం ఉంది. అయితే రాష్ట్ర ఏర్పాటు తర్వాత పోలీస్ స్టేషన్ల మెయింటనెన్స్ కోసం ప్రభుత్వమే నిధులు ఇవ్వడం మొదలుపెట్టింది. దీంతో వసూళ్ల పర్వం ఆగిపోయిందంటున్నారు. కానీ ఇప్పుడు కొద్దిరోజులుగా పోలీస్ స్టేషన్లలో మెయింటనెన్స్ వసూలు చేయడం మొదలు పెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి..

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోలీస్ స్టేషన్లకు మెయింటనెన్స్ నిధులు రావడం లేదంటున్నారు. నెలల తరబడిగా బిల్లులు పెండింగ్ లో ఉండటంతో.. అధికారులు సైతం చేతుల్లో నుంచి డబ్బులు పెట్టలేకపోతున్నారట. దీంతో మళ్లీ పాత పద్దతినే మళ్లీ ఫాలో అవుతున్నామని డిపార్ట్ మెంట్ లో ఉన్నవారే చెబుతున్నారు. స్టేషన్‌కు వచ్చేవాళ్లు, కొంత మంది లోకల్ లీడర్లు, వ్యాపారుల నుంచి మెయింటనెన్స్ పేరిట వసూళ్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సర్కారు నుంచి సమాధానం లేకపోవడంతో తాము వచ్చీపోయే వాళ్ల దగ్గర చేతులు చాచాల్సిన దుస్థితి ఏర్పడిందని సన్నిహితులతో చెప్పుకుని బాధపడుతున్నారట పోలీసులు.  పోలీసులు ఇలా ప్రతి నెల చేతులు చాస్తుండటంతో కొందరు నేతలు ‘ప్రతి నెల మేమే ఇవ్వాలా?’ అని ఎదురు ప్రశ్నిస్తున్న సందర్భాలు కూడా ఎదురవుతున్నాయంటున్నారు.

ఇది ఏదో ఒక్క స్టేషన్ లో కాదట రాష్ట్ర రాజధాని నుంచి మొదలుపెడితే మారుమూల ప్రాంతాల వరకు ఇదే పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది. ఓ వైపు హెల్త్ స్కీం విషయంలో పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. అలెవెన్సులు ఆపేయడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటికి తోడు.. స్టేషన్ మెయింటనెన్స్ భారం కూడా పడటంతో చాలామంది అధికారులు కూడా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu police cm-revanth-reddy telangana-government mtax

Related Articles