Maa Nanna Superhero : మా నాన్న సూపర్ హీరో మూవీ రివ్యూ !

అభిలాష్ కంకర దర్శకత్వంలో “మా నాన్న సూపర్ హీరో” అనే మూవీలో నటించాడు. అసలు సినిమా కథేంటో చూసేద్దాం.


Published Oct 11, 2024 12:20:49 PM
postImages/2024-10-11/1728666973_MaaNanna5c1028dae0Vjpg799x4144g.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సుధీర్ బాబు సినిమా. చాలా రోజులుగా మంచి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు సుధీర్ బాబు. కరెక్ట్ టైంలో కరెక్ట్ సినిమా సెలక్ట్ చేసుకున్నాడు.అభిలాష్ కంకర దర్శకత్వంలో “మా నాన్న సూపర్ హీరో” అనే మూవీలో నటించాడు. అసలు సినిమా కథేంటో చూసేద్దాం.


జానీ ( సుధీర్ బాబు) కొన్ని పరిస్థితుల వల్ల.. అనాధగా ఆశ్రమంలో పెరగాల్సి వస్తుంది. కొంత వయసు వచ్చాక శ్రీనివాసరావు ( షియాజీ షిండే) జానీని దత్తత తీసుకుంటాడు. కాని జాని ఇంటికి వచ్చాక శ్రీనివాసరావు టైం ఉల్టా అయిపోతుంది. వ్యాపారం పోతుంది. అందరు జానీ వల్లే ఇదంతా జరుగుతుందని అందరు తిడతారు. కాని శ్రీనివాసరావు మాత్రం ఒక్కమాట కూడా అనడు. తర్వాత తర్వాత  కాలంలో కష్టాలు, నష్టాలు మరింత పెరగడంతో.. తండ్రి శ్రీనివాసరావు కూడా జానీని ద్వేషించడం మొదలు పెడతాడు. ఇంతలో జానీ కి శ్రీనివాసరావు మీద పిచ్చి ప్రేమ కలుగుతుంది. తండ్రి చేసే అప్పులన్నీ తీరుస్తుంటాడు. కాకపోతే.. ఇంతలో శ్రీనివాసరావు ఓ పెద్ద ఆపదలో చిక్కుకుంటాడు. ఆ కష్టం నుండి తండ్రిని తప్పించడానికి జానీకి కోటి రూపాయలు అవసరం అవుతాయి. ఈ డబ్బు వేటలో ఉండగా జానీ తన అసలు తండ్రి ని కలుస్తాడు. అప్పటి నుంచి అసలు తండ్రికి  శ్రీనివాసరావు కి జరిగే ఎమోషనల్ స్టోరీనే ఈ మా నాన్న సూపర్ హీరో.


ప్రతి దర్శకునికి ఓ స్పెషల్ స్టైల్ ఉంటుంది. డైరక్ట్రర్ కు కథ మీద ఇష్టం ఉన్నట్లు తెలుస్తుంది. దర్శకుడు అభిలాష్ కంకర తను అనుకున్న కథనాన్ని పరుగులు పెట్టించడం కన్నా, ఓ ఫీల్ గుడ్ నేరేషన్ తో.. హృదయాల్ని పట్టి ఉంచడానికి ప్రాధాన్యం ఇస్తూ తాను నమ్మిన మార్గంలో సినిమాని నడిపించాడు. ఇందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా. కాకపోతే స్లో స్క్రీన్ ప్లే వల్ల కొంతమందికి నచ్చదు. స్టోరీ సినిమాలు చూసేవారికి మాత్రం కన్నీళ్లు పెట్టిస్తుంది.  సినిమా అధ్భుతంగా ఉంది.


“మా నాన్న సూపర్ హీరో” మూవీ విషయంలో ముందుగా మెచ్చుకోవాల్సింది హీరో సుధీర్ బాబుని. నమ్మిన కథ కోసం.. అతను తగ్గిన విధానం ఆశ్చర్యం కలిగించింది. పాత్రలో అతను ఒదిగిన తీరు హైలెట్. ఆఖరికి ఓ చిన్న ఆర్టిస్ట్ చేత కూడా.. కాళ్లతో తన్నించుకున్నాడు. హీరోలలో ఇంత మార్పు రావడం.. సినిమాకే కాదు, ఇండస్ట్రీకి కూడా శుభ సూచికం. సినిమా కు మరో బ్యాక్ బోన్ సాయిచంద్. పాత్రకు ప్రాణం పోశాడు. మ్యూజిక్ కూడా బాగుంది. ఎడిటింగ్ కాని బాగుండి ఉంటే ఇంకా బాగుండేది. సుధీర్ బాబుకి మాత్రం ఈ సినిమా హిట్టే.
 

newsline-whatsapp-channel
Tags : movie-news review ma-nanna-super-hero sudheer-babu movie-review

Related Articles