ప్రపంచంలో మనిషి ఎప్పుడు మరణించబోతున్నాడో కూడా ముందే అంచనా వేస్తుంది. అతి త్వరలోనే ఈ ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మరణం అంచనా వెయ్యలేనిది..ఎప్పుడు ఎక్కడ ఎవరు అంచనా వెయ్యలేనిది. ప్రతి జీవికి పుట్టడం ..మరణించడం సాధారణంగా జరిగే క్రియ. దానిని ఎవ్వరు అంచనా వెయ్యలేరు. కాని ఇఫ్పుడు ఏఐ టెక్నాలజీ తో మరణాన్ని కూడా అంచనా వేసేస్తున్నారు. ప్రపంచంలో మనిషి ఎప్పుడు మరణించబోతున్నాడో కూడా ముందే అంచనా వేస్తుంది. అతి త్వరలోనే ఈ ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
సైంటిస్టులు ఏఐ సాయంతో ఈ ‘డెత్ కాలిక్యులేటర్’ను అభివృద్ధి చేశారు. మీరు మీ మరణానికి ఎంత సమీపంలో ఉన్నారో ఈ కాలిక్యులేటర్ తెలియజేస్తుంది. లాన్సెట్ డిజిటల్ హెల్త్‌లో ప్రచురించిన ఏఐ పవర్డ్ ఎలక్ట్రో కార్డియోగ్రామ్‌లు (ECG) దీని సాయంతో వ్యక్తి ఎవరైనా ఆరోగ్యసమస్యలతో ఎప్పుడు చనిపోతారో తెలిస్తే చాలా వరకు మరణాల ప్రమాదాన్ని కూడా అంచనా వెయొచ్చు. అయితే, ఈ ఏఐ టూల్ రోజువారీ వైద్య సంరక్షణలో ఉపయోగం ఉండదని చెప్పవచ్చు.
భవిష్యత్తులో గుండె వైఫల్యాన్ని కూడా అంచనా వేయగలదు. డయాబెటిస్ , కిడ్నీ ఫెయిల్యూర్స్ లాంటి వాటిని కూడా ఈ డెత్ కాలిక్యులేటర్స్ తో పసిగట్టచ్చు. యూకే ఆరోగ్య సంస్థ నేషనల్ హెల్త్ సర్వీస్ కింద ఉన్న రెండు ఆస్పత్రులు వచ్చే ఏడాది మధ్య నుంచి ఈ ఏఐ టెక్నాలజీని ట్రయల్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే, వచ్చే ఐదేళ్లలోపు ఆరోగ్య సేవల్లోకి అందుబాటులోకి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఆసుపత్రుల్లోకి చేరే వందలాది మంది రోగులు త్వరలో ఏఐ “డెత్ కాలిక్యులేటర్” ద్వారా తమ జీవితకాలం గురించి అంచనా వేయొచ్చు.