MAA: మరో 18 యూట్యూబ్ ఛానళ్ల బ్యాన్

మరో 18 యూట్యూబ్ ఛానళ్లను మా అసోషియషన్ నిషేధించింది.  నటి, నటులపై అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్‌ ఛానళ్లకు మా అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు లీగల్ నోటీసులు పంపించారు.


Published Jul 24, 2024 05:15:11 AM
postImages/2024-07-24/1721815561_maa22.PNG

న్యూస్ లైన్ డెస్క్:  మరో 18 యూట్యూబ్ ఛానళ్లను మా అసోషియషన్ నిషేధించింది.  నటి, నటులపై అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్‌ ఛానళ్లకు మా అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు లీగల్ నోటీసులు పంపించారు. మొదట 22 యూట్యూబ్​ ఛానళ్లపై మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్​ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. నటీనటులపై అసభ్యంగా దుష్ప్రచారం చేస్తున్న మరో 18 యూట్యూబ్​ ఛానళ్లను బ్రహామి ట్రోల్స్ 3.0, డీకే క్రియేషన్స్, నవీన్ కృష్ణ, రేసింగ్ ఉమాపతి, డాక్టర్ ట్రోల్స్, నేను మీ జాను, లైక్ చేయి బ్రో, రాజ్ తేజ్ వోలగ, ఇదివ్యపరం, 1 ఎం ట్రోల్స్, అప్‌డేట్ ట్రోల్స్, మై ఛానళ్ల మై రోల్, కామెడీ ట్రోలింగ్, కింగ్ చంద్రహాస్, కేసీపీడీ ట్రోల్స్, కామెడీ ట్రోలింగ్, డీవీవీ మోడ్రన్ ట్రోల్స్ లపై మూవీ అసోసియేషన్​ నిషేధించింది. సినిమా వాళ్లపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం అని విష్ణు స్పష్టం చేశారు. ఇటీవల చిన్న పిల్లల పై యూట్యూబ్ లో అసభ్యకరంగా మాట్లాడుతూ వీడియోలు చేసిన ప్రవీణ్ హనుమంతు అనే వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

newsline-whatsapp-channel
Tags : telangana manchu-vishnu maa cinema-news

Related Articles