'మనసంతానువ్వే' చైల్డ్ ఆర్టిస్ట్..ఇప్పుడు ఎక్కడ ఉందో ఎలా ఉందో తెలుసా..?

Published 2024-07-05 04:54:05

postImages/2024-07-05//1720173189_52fc6ef70a944052bc474be6a0d49821.jpeg

ఒకప్పుడు టాలీవుడ్‌లో చైల్ట్ ఆర్టిస్టులుగా నటించిన చాలా మంది ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరికొంతమంది సినిమాను వదిలేసి ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుహాని కూడా ఒకరు. సుహాని అని పేరు చెప్పగానే టక్కున గుర్తుపట్టకపోవచ్చు. కానీ తూనీగా...తూనీగా అంటే వెంటనే గుర్తుకు వచ్చేది బేబీ కంటింగ్‌తో కనిపించే ఓ క్యూట్ పాప. ఆ క్యూట్ పాప పేరే సుహాని. 

తెలుగులో చాలా సినిమాల్లో నటించినప్పటికీ సుహానీకి మనసంతా నువ్వే సినిమాతోనే ఎక్కువ గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో తూనీగా తూనీగా పాటలో ఆమె హావభావాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సినిమాలో చిన్ననాటి ఉదయ్ కిరణ్‌కి ప్రియురాలిగా సుహాని కనిపించింది. తన క్యూట్ మాటలతో బేబీ హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకుంది. ఇక తెలుగులో సుహాని మొట్టమొదటిసారి 1996లో వచ్చి బాల రామాయణం సినిమాతో సిల్వర్ స్క్రీన్‌కు పరిచయమైంది. 

ఈ సినిమా తరవాత తెలుగులో చాలా సినిమాలలో నటించి మెప్పించింది. ఆ తరవాత కేవలం తెలుగలోనే కాకుండా సుహాని తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించింది. హిందీలో సుహాని హిందుస్థాన్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించగా తన నటనకు గానూ నంది అవార్డును అందుకుంది. చిన్నతనంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన సుహాని తెలుగులో సవాల్ సినిమాతో హీరోయిన్‌గా సైతం ఎంట్రీ ఇచ్చింది. 

కానీ ఈ సినిమా ఆశించినమేర విజయం సాధించలేదు. కానీ ఆ తరవాత స్నేహగీతం సినిమాతో ప్రేక్షకులను పలకరించి మెప్పించింది. ఇక ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న సుహాని 2022 మ్యుజిషియన్, మోటివేషనల్ స్పీకర్ అయిన వెభర్‌ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం భర్తతోనే విదేశాలలో ఉంటుంది. ఇక సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న సుహానీ రాబోయే రోజుల్లో సినిమాల్లోకి వస్తుందో లేదో చూడాలి.