ఈ అంశంపై స్పందిస్తూ కేటీఆర్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ నాయకులు అమ్మిన, మీ కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసిన ప్లాట్లలో నిర్మించుకుంటున్న ప్రజల ఇండ్లను మేడ్చల్ మాజీ సుధీర్ రెడ్డి ఏమి ఆశించి ఈరోజు కూలగొట్టించాడో ఒకసారి విచారణ చేపట్టండి అని సూచించారు. ప్రజా పాలనలో ప్రజలకు మద్దతు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో నిర్బంధిస్తారా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్దకి మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పీర్జాదిగూడలో ఇళ్ల కూల్చివేతలను అడ్డుకున్న BRS కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీని వెనుక మేడ్చల్ మాజీ సుధీర్ రెడ్డి హస్తం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా, ఈ అంశంపై స్పందిస్తూ కేటీఆర్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ నాయకులు అమ్మిన, మీ కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసిన ప్లాట్లలో నిర్మించుకుంటున్న ప్రజల ఇండ్లను మేడ్చల్ మాజీ సుధీర్ రెడ్డి ఏమి ఆశించి ఈరోజు కూలగొట్టించాడో ఒకసారి విచారణ చేపట్టండి అని సూచించారు. ప్రజా పాలనలో ప్రజలకు మద్దతు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో నిర్బంధిస్తారా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
సుధీర్ రెడ్డి మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో చేస్తున్న అరాచకాలపై ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకోవాలని, లేదంటే ప్రజలు తిరగబడుతారని హెచ్చరించారు. ఆ స్థలాలను ప్రజలకు కాంగ్రెస్ నాయకుడు రాందాస్ గౌడ్, మరో కాంగ్రెస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ కుటుంబం అమ్మారని గుర్తుచేశారు. గతంలో రెవెన్యూ అధికారులు దీనికి పట్టా భూమిగా ఎన్వోసీ జారీ చేశారు.
ప్రభుత్వ నిబంధనలకు లోబడి మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకొని చాలా మంది ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారు. కానీ, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులను వేధించి అమాయక ప్రజలు లక్షలు పోసి నిర్మించుకున్న ఇళ్లను ఈ రోజు కూలగొట్టించారని మండిపడ్డారు. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం అమాయక ప్లాట్ ఓనర్స్ ఇళ్లను కూల్చివేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై కక్షగట్టి చేస్తున్న వేధింపులకు ప్రజలు ముగింపు పలకడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మేయర్ జక్క వెంకట్ రెడ్డిని, కార్పొరేటర్లను వేధిస్తున్నారని, తాము అధికారంలో ఉన్న సమయంలో ఇలా అనుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు మళ్లీ వడ్డీతో సహా చెల్లిస్తామని కేటీఆర్ హెచ్చరించారు.