Manchu Manoj: కూతురు పేరును రివీల్ చేసిన మంచు మనోజ్. !

మంచు మనోజ్ భార్య మౌనికకు ఏప్రిల్ లో  ఓ పాప పుట్టింది. మంచు వారి ఇంట్లో మరో మహాలక్ష్మి పుట్టింది. ఇటీవల ఆ చిన్నారికి బారసాల నిర్వహించి పేరు పెట్టారు. తాజాగా మంచు మనోజ్ స్వయంగా ఆ పాప పేరును తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రివీల్ చేశాడు.


Published Jul 08, 2024 04:10:00 PM
postImages/2024-07-08/1720435238_images4.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  మంచు మనోజ్ భార్య మౌనికకు ఏప్రిల్ లో  ఓ పాప పుట్టింది. మంచు వారి ఇంట్లో మరో మహాలక్ష్మి పుట్టింది. ఇటీవల ఆ చిన్నారికి బారసాల నిర్వహించి పేరు పెట్టారు. తాజాగా మంచు మనోజ్ స్వయంగా ఆ పాప పేరును తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రివీల్ చేశాడు.


మంచు మనోజ్ కూతురు పేరు 'దేవసేన శోభ ఎంఎం' అనే పేరు పెట్టినట్టు అఫిషియల్ గా రివీల్ చేశారు.  అయితే దేవసేన శోభ అనే పేరుని సుబ్రహ్మణ్య స్వామి భార్య దేవసేన పేరు నుంచి తీసుకున్నామని, అలాగే శోభ అని దివంగత మా అత్తగారు శోభ నాగిరెడ్డి నుంచి తీసుకున్నామని మనోజ్ క్లారిటీ ఇచ్చారు మనోజ్.


ఈ పిక్ లో ...మోహన్ బాబు ఫ్యామిలీ తో పాటు... అందరు చిన్నారి దేవసేనను ఆశ్చర్యంగా చూడడం గమనించవచ్చు.మ‌రో ఫొటోలో మంచు మనోజ్, మౌనిక, కుమారుడు ధైరవ్, కూతురు దేవసేన శోభ ఉన్నారు. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అంతేకాదు ...ఈ జంటకు అంతా మంచే జరగాలని కూడా  కోరుకుంటున్నారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news manchu-family

Related Articles