గోవాలో తాను ఎక్కిన ఇండిగో 6e585 విమాన సిబ్బంది అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె వాపోయారు."నా లగేజీ బ్యాగ్‌ను పక్కకు తోసేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఇండిగో విమానయాన సంస్థ తీరుపై నటి మంచు లక్ష్మి మండిపడ్డారు. రీసెంట్ గా ఇండిగో ఫ్లైట్ లో ప్రయాణించినపుడు సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారంటూ తనకు ఎదురైన ఇబ్బందులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గోవాలో తాను ఎక్కిన ఇండిగో 6e585 విమాన సిబ్బంది అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె వాపోయారు."నా లగేజీ బ్యాగ్‌ను పక్కకు తోసేశారు. బ్యాగ్ ఓపెన్ చేయడానికి కూడా అనుమతించలేదు.
అలా కాదని అంటే గోవాలోనే నా సామాగ్రిని వదిలేస్తామన్నారు ..అది కూడా ఏదో బెదిరించినట్లు తెలిపారు. నాతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. బ్యాగ్‌కు సెక్యూరిటీ ట్యాగ్ కూడా పెట్టలేదు. ఇదొక రకమైన వేధింపు. ఇంకెప్పుడూ ఇండిగో ఎక్కేది లేదు" అని మంచు లక్ష్మి పేర్కొన్నారు.