నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ...పదే పదే పొడిచాడని సైఫ్ తెలిపారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: సైఫ్ పై దాడి జరిగిన సంగతి అందరికి తెలిసిందే . బాలీవుడ్ మీడియా ఓ వారం నుంచి ఊదరగొట్టేస్తుంది. ముంబయిలోని తన నివాసంలో కత్తిపోట్లకు గురైన నటుడు సైఫ్ అలీఖాన్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. తనపై ఏ విధంగా దాడి జరిగిందో వరుస క్రమంలో సైఫ్ అలీఖాన్ వివరించారు . నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే ...పదే పదే పొడిచాడని సైఫ్ తెలిపారు.
"నేను కరీనా మా గదిలో ఉన్నాం. సడెన్‌గా చిన్న కుమారుడు జెహ్ ఏడుపు వినిపించింది. బయటకు వచ్చిన చూస్తే అక్కడ ఓ దుండగుడు స్టాఫ్ నర్స్పై దాడి చేస్తున్నాడు. నేను తనను పట్టుకోవడానికి ప్రయత్నించాను. వెంటనే అతడు నా వీపు, మెడ చేతులపై కత్తితో దాడి చేశాడు. తెల్లవారుజామున 2.30 నుంచి 2.40 గంటల మధ్య ఈ ఘటన జరిగిందన్నారు.
ముంబయిలోని బాంద్రాలో ఉన్న ఆయన నివాసం వద్ద పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లు రెండు షిఫ్టుల్లో భద్రత విధులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో సైఫ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు. నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను అరెస్టు చేశారు. మహ్మద్ షరీఫుల్ ఏడు నెలల క్రితమే మేఘాలయలోని డౌకీ నది దాటి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించారు. అంతేకాదు అతడు భారత్ లో విజయ్ దాసుగా పేరు మార్చుకొని బతుకుతున్నాడు. డబ్బు కోసం ఈ దాడి చేసినట్లు తెలిపారు.