జనవరి 24 ప్రేక్షకుల ముందుకు రానుంది .ఈ చిత్రం ప్రివ్యూను ఓ రోజు ముందే మీడియాకు చూపించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టైటిల్ తోనే అందరిని ఆకర్షించిన చిత్రం గాంధీ తాత చెట్టు ..ప్రముఖ దర్శకుడు సుకుమార్ సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రానికి పద్మావతి మల్లాది దర్శకురాలు . సుకుమార్ భార్య తబితా సుకుమార్ . జనవరి 24 ప్రేక్షకుల ముందుకు రానుంది .ఈ చిత్రం ప్రివ్యూను ఓ రోజు ముందే మీడియాకు చూపించారు.
రామచంద్రయ్య అనే వ్యక్తి ఊరిలో మంచి మనిషిగా, గాంధేయవాదిగా అందరికి ఇష్టమైన వ్యక్తి. ఓ చెట్టుతో స్నేహం కూడా చేస్తుంటాడు. సొంత ఊరిలో ...తన మనుషుల మధ్య ప్రకృతికి దగ్గరగా ఉండడం ఇష్టపడే వ్యక్తి అతను..తన మనవరాలికి గాంధీ అనే పేరు పెట్టుకుంటాడు . ఆ అమ్మాయికి తాత అంటే చాలా ఇష్టం. తాత పాటించే గాంధీ భావాలు , విలువలు చాలా పాటిస్తుంది.
ఓ సారి అనుకోకుండా ఊరికి కెమికల్ ఫ్యాక్టరీ స్థాపన కోసం ఓ పెట్టుబడి దారుడి తరపున సతీష్ అనే ఏజెంట్ వస్తాడు. అందరి పొలాలు అమ్మాలని అడుగుతాడు . అప్పటి వరకు ఊరిలో పండించిన చెరకు పంటను కూడా తీసుకోవడానికి షుగర ఫ్యాక్టరీ వాళ్లు కూడా కొనరు. వ్యవసాయం మీద అప్పటికే విరక్తి చెంది ఉంటారు.అమ్మేస్తారు. అయితే రామచంద్రయ్య మాత్రం పొలం అమ్మడు . తన మనవరాలు గాంధీ సిధ్ధాంతాలతో కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ల ను ఎలా గెలవగలిగిందనేదే స్టోరీ.
ఇది రెగ్యులర్ కమర్షియల్ చిత్రం కాదు. చాలా రోజుల తరువాత ఓ పల్లెటూరి వాతావరణంలో ఎటువంటి రక్తపాతం, హింస లేకుండా ఓ ప్లెజెంట్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. అవార్డు విన్నింగ్ సినిమా కూడా. చాలా ఆలోచింప చేసే సినిమా. సుకృతి నటన చెట్టుకు పునాది లాంటిది. చక్రపాణి పాత్రకు ప్రాణం పోశాడు. ఓవరాల్ గా సినిమా ఆలోచింపజేసేలా ఉంది.