కేంద్రం నిన్న బాలయ్యకు పద్మభూషణ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో, బాలకృష్ణ స్పందించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: సంక్రాంతి హిట్టు బాలయ్య బాబుకి మంచి బూస్టింగ్ అనే చెప్పాలి. నందమూరి బాలకృష్ణను పద్మభూషణ్ పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. కేంద్రం నిన్న బాలయ్యకు పద్మభూషణ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో, బాలకృష్ణ స్పందించారు.
తనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. తనకు పద్మఅవార్డు ప్రకటించగానే ఎంతో మంది స్పందించి మనస్పూర్తిగా అభినందనలు తెలిపారని థాంక్యూ చెప్పారు బాలయ్య. ఈ సుదీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న ప్రతి వ్యక్తికి థాంక్యూ చెప్పారు బాలయ్య.
ఎంతో మంది టెక్నీషన్స్ తో పాటు డైరక్టర్లు ..నా వెన్నంటే ఉండి, అనుక్షణం ప్రోత్సహిస్తున్న అభిమానులకు, నాపై అమితమైన ఆదరాభిమానాలు ప్రదర్శిస్తున్న ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను . ఇతర పద్మఅవార్డు గ్రహీతలందరికీ అభినందనలు తెలియజేశారు.