మంచు ఫ్యామిలీ అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. నాగార్జున నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి ఇండస్ట్రీలో మోస్తారు నటులుగా
న్యూస్ లైన్ డెస్క్:మంచు ఫ్యామిలీ అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. నాగార్జున నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి ఇండస్ట్రీలో మోస్తారు నటులుగా ఎదుగుతున్నారు. అలా మంచి విష్ణు, మంచు మనోజ్ హీరోలుగా స్థిరపడ్డారు కానీ మంచు లక్ష్మీ సరైన అవకాశం కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. విలక్షణమైన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం మంచు లక్ష్మి తహతహ లాడుతోంది. అలాంటి ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ లో నటిస్తోంది.
కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉండే ఈమె ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇతర విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. అలాంటి మంచు లక్ష్మి కేవలం నటిగానే కాకుండా, నిర్మాతగా పలు సినిమాలకు దర్శకురాలిగా కూడా పనిచేసింది. అలాంటి మంచు లక్ష్మి తాజాగా ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది. అయితే ఈ ఇంటర్వ్యూలో ఆ యాంకర్ లొట్టలు వేయడం ఆమె గమనించింది.
వెంటనే ఆ యాంకర్ ను పిలిచి మంచు లక్ష్మీ ఇలా అన్నదట. చాలా బాగా లొట్టలు వేస్తున్నారు మరొకసారి వేయండని అడిగిందట. మా ఆయన కూడా నన్ను లొట్టలు వేస్తూ పిలిచేవారు. నేను ఇంట్లో ఉన్నప్పుడు మా ఆయనకి ఏదైనా ఫీలింగ్ కలిగిన, ఆనందం కలిగినా కానీ లొట్టలు వేస్తూ నాకు సిగ్నల్స్ ఇచ్చేవాడు. అలా చేయవద్దని నేను చాలా సార్లు చెప్పాను.
ఎందుకంటే నేను ఎక్కడైనా బయటకు వెళ్తే ఎవరైనా లొట్టలు వేస్తే మా ఆయనే కావచ్చని వెన్నుదిరిగి చూస్తూ ఉంటాను. ప్రస్తుతం మీరు కూడా లొట్టలు వేయడంతో నాకు మా ఆయన గుర్తొచ్చారని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే లక్ష్మీ మంచు శ్రీనివాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం మన అందరికీ తెలుసు..