Megastar : అభిమానిని తోసేసిన చిరంజీవి.. వీడియో వైరల్

ఓ వ్యక్తి ఎయిర్ పోర్టులో నడుచుకుంటూ వెళ్తున్న మెగాస్టార్ తో ఫొటో దిగేందుకు ప్రయత్నించాడు. అప్పటికే అసహనంగా ఫీలవుతున్న చిరంజీవి.. సెల్ఫీ కోసం వచ్చిన ఇండిగో ఎయిర్ లైన్ సిబ్బందిని పక్కకు తోసేశాడు.


Published Jul 30, 2024 06:57:45 AM
postImages/2024-07-30/1722340057_chiruinparis.jpg

న్యూస్ లైన్ డెస్క్ : విశ్వంభర సినిమా పనులు ముగించుకున్న మెగాస్టార్ చిరంజీవి.. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మరో సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. అయితే.. షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన మెగాస్టార్ ఒలంపిక్ గేమ్స్ కి హాజరయ్యేందుకు పారిస్ చేరుకున్నారు. కుటుంబంతో కలిసి పారిస్ చేరుకున్న చిరంజీవి అక్కడ వీధుల్లో ఫ్యామిలీతో తిరుగుతూ ఎంజాయ్ చేశాడు. ఈ వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

అయితే.. పారిస్ ఎయిర్ పోర్టులో కనిపించిన చిరంజీవితో సెల్ఫీలు దిగేందుకు కొందరు సిబ్బంది ప్రయత్నించారు. ఇండిగో ఎయిర్ లైన్ కు చెందిన ఓ వ్యక్తి ఎయిర్ పోర్టులో నడుచుకుంటూ వెళ్తున్న మెగాస్టార్ తో ఫొటో దిగేందుకు ప్రయత్నించాడు. అప్పటికే అసహనంగా ఫీలవుతున్న చిరంజీవి.. సెల్ఫీ కోసం వచ్చిన ఇండిగో ఎయిర్ లైన్ సిబ్బందిని పక్కకు తోసేశాడు.

 

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతోంది. అంత పెద్ద స్థాయికి ఎదిగి.. ఒక అభిమాని పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదంటూ నెటిజనులు మెగాస్టార్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

 

 

newsline-whatsapp-channel
Tags : chiranjeevi newslinetelugu mega-family latest-news telugu-news paris-olympic parisolympics olympic2024-

Related Articles