Mirzapur 3- మీర్జాపూర్ 3 ..ఈ సారైనా గుడ్డు గూండాగిరి వర్కవుట్ అయ్యిందా !

Published 2024-07-05 15:53:20

postImages/2024-07-05//1720175000_mirzapur.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఓటీటీ సీరిస్ లు చూసే ఎవ్వరికైనా ..మీర్జాపూర్ సీరిస్ లు పరిచయమే..యూత్ కైతే ఇంట్రడక్షన్ అవసరం లేదు. కావాల్సినంత మసాలా...కాదు కాదు అంతకు మించిన వయలెన్స్ ..అడల్ట్ కంటెంట్ ..ఇంతకు మించి యూత్ కు తెగ నచ్చేసే వల్గర్ డైలాగ్స్ ..ఇప్పటి వరకు సీరిస్ లు రెండు ఇలా సూపర్ డూపర్ హిట్ట్ . యాక్టర్స్ కైతే ...టాప్ స్టార్స్ ఫేమ్ వచ్చింది.అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠి శర్మ, రషిక దుగల్, విజయ్ వర్మ, ఇషా తల్వార్, పంకజ్ త్రిపాఠి, అంజుమ్ శర్మ యాక్టింగ్ అదరగొట్టేశారు.'మీర్జాపూర్' మూడో సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఎందుకు లేటు స్టోరీలోకి వెళ్లిపోదాం. 


మీర్జాపూర్ 2లో కథ ఎక్కడ అయితే ముగిసిందో... మీర్జాపూర్ 3లో అక్కడ మొదలైంది. బ్రదర్  బబ్లూ, వైఫ్  స్వీటీ చనిపోయిన తర్వాత ప్రతీకారం తీర్చుకోవాలని కాలిన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి), మున్నా భయ్యా పై గుడ్డు పండిట్ అదే అలీ ఫజల్ ఎటాక్ చేస్తాడు. వాళ్లిద్దర్ని షూట్ చేస్తాడు. అప్పుడు మున్నా మరణిస్తాడు.  నిజమే ఈ సీరిస్ లో మున్నా ఉండడు. కాలిన్ భార్య బీనా త్రిపాఠి అండతో మీర్జాపూర్ నయా డాన్ అవుతాడు గుడ్డు. గోలు క్యారక్టర్ లో ఉణ్న శ్వేతా త్రిపాఠి...అతడికి లెఫ్ట్ అండ్ రైట్ సపోర్టర్ అవుతుంది. వాళ్లిద్దరూ ను తమ గుప్పిట్లో ఉంచుకోగలిగారా? లేదా? అనేదే మీర్జాపూర్ 3. అనుకున్నట్లే ఈ వార్ లో చాలా ఇబ్బందులు , గొడవలు , పవర్ కోసం చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ ఇబ్బందులే మీర్జాపూర్ స్టోరీ.


సూపర్ హిట్ వెబ్ సిరీస్ లేదా సినిమాకు సీక్వెల్ తీయడం, తీసి మెప్పించడం అంత సులభం కాదు. మొదట సీరిస్ ...ఫస్ట్ పార్ట్ హిట్ అయ్యాక ...సెకండ్ పార్ట్ ..డైరక్టర్ కి చాలా ప్రెజర్ పడిపోతుంది. కాని ప్రెజర్ హ్యాండిల్ చేసి మీర్జాపూర్ 2 సూపర్ హిట్ . రెండు సూపర్ హిట్స్ తర్వాత పార్ట్ 3 కూడా ఆరేంజ్ రావడానికి చాలా కష్టపడాలి. అది కత్తి మీద సాము లాంటి వ్యవహారమే. వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ లేదా సినిమా వచ్చినప్పుడు ఎటువంటి అంచనాలు ఉండవు. కానీ, విజయం తర్వాత ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడతాయి. వాళ్ళు ఆశించే విషయాలు పెరుగుతాయి. 'మీర్జాపూర్ 2' అంచనాలు అందుకుంది కానీ మూడో సీజన్ మాత్రం ఆశించిన రీతిలో లేదు. ఆడియన్స్ అంత మజా ఇవ్వలేదు. 


మీర్జాపూర్ అనగానే...అమ్మో అడల్ట్ కంటెంట్ ..దీన్ని తీసేయడానికే...డైరక్టర్ ...ఈ సారి ..వయలెన్స్ ...వల్గారిటీ కాస్త తగ్గించాడు. ఇందుకేనేమో ...పెద్దగా లేదంటున్నారు యూత్. అధికారం కోసం వేసే స్కెచ్ లు ఎక్కువయిపోయాయి.  ఈ సీరిస్ లో ...మున్నాభాయ్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ముందు సీరిస్ లో సగం సీరిస్ తన భుజాల మీద మోసేశాడు. ఇప్పుడు ఆ క్యారక్టర్ లేకపోవడంతో సీరిస్ లో ఆ లోటు కనిపిస్తుంది. ఫిమేల్ క్యారక్టర్లకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఒక్కో ఎపిసోడ్ 45 నుంచి 50 నిమిషాలు ఉండటంతో కొన్ని సన్నివేశాలు / ఎపిసోడ్స్ సాగదీసిన ఫీలింగ్ కలిగింది. కథలో క్యూరియాసిటీ ఫ్యాక్టర్, నెక్స్ట్ ఏంటి? అని ఎంగేజ్ చేసే, గ్రిప్పింగ్ మూమెంట్స్ మిస్ అయ్యాయి. ఆ డార్క్ హ్యూమర్ మిస్ అయిన కారణంగా మిర్జాపూర్ 3 లో మిస్ అయ్యింది.గుడ్డు పాత్రలో అలీ ఫజల్ చక్కటి నటన కనబరిచారు. సిరీస్‌ను తన భుజాలపై మోశారు. కానీ, ఒక్కడిపై భారం అంతా పడటంతో షో రన్ చేయడం కష్టమైంది.


'మీర్జాపూర్ 3'లో మెరుపులు ఉన్నా..కాని లాస్ట్ సీరిస్ లో ఉన్నంత లేదు. ఏదో మస్తీ చెయ్యాలనుకున్నా ...అది కుదర్లేదు...పాత పార్ట్స్ ఫేమ్ తో  మీర్జాపూర్ కొట్టుకుపోతుంది. చూడొచ్చు ఓ సారి..అది కూడా నువ్వు భీభత్సమైన ఖాళీ గా ఉంటే చూడొచ్చు.