దాదాపు 50 శాతం మంది మహిళలు గర్భం ధరించే సమయంలో అతి తక్కువ ఐరన్ కలిగి ఉన్నట్టు అధ్యయనం పేర్కొంది
న్యూస్ లైన్ ; స్పెషల్ డెస్క్: ప్రెగ్నెన్సీ లో కొంతమందికి ఏం కాంప్లికేషన్స్ ఉండవు. కాని కొంతమందికి కాన్సివ్ అని తెలిసిన దగ్గర నుంచి ఏదో ఒక ప్రాబ్లమ్ నూటికి 98 శాతం ఇబ్బందులతోనే ఉంటారు. కాని చాలా మందిలో కాల్షియం లోపాలు ...ఐరన్ లోపాలు ..చాలా ఉంటాయి. పిండం అభివృద్ధి చెందేందుకు ఐరన్ నార్మల్ రోజుల కంటే పదిరెట్లు ఎక్కువ అవసరమవుతుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళ శరీరం ఎక్కువ ఐరన్‌ను ఉపయోగించుకుంటుంది. అయితే దాదాపు 50 శాతం మంది మహిళలు గర్భం ధరించే సమయంలో అతి తక్కువ ఐరన్ కలిగి ఉన్నట్టు అధ్యయనం పేర్కొంది. నిజానికి మార్నింగ్ సిక్ కారణంగా ఈ ఇబ్బందులు రావచ్చు. కాని వెంటనే దాన్ని రీప్లేస్ చెయ్యాలి తప్పదు.
ఐరన్ లోపం వల్ల వచ్చే ఇబ్బందులు ఇవే ...
* శరీరంలో ఐరన్ లోపం రక్త హీనతకు దారితీస్తుంది.
* హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయడంలో శరీరం ఇబ్బందిపడుతుంది.
* శరీరమంతా ఆక్సిజన్ సరఫరా చేసే ఎర్రరక్తకణాల సామర్థ్యం తగ్గిపోతుంది.
* ఇది బిడ్డకు జన్మనిచ్చే సమయంలో తల్లీపిల్లలు ఇద్దరికీ ముప్పు ఏర్పడుతుంది.
* ఐరన్ లోపం వల్ల నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం, బరువు తక్కువగా ఉండడం, దీర్ఘకాలంగా న్యూరోడెవలప్‌మెంట్ సమస్యలు వస్తాయి.