health: వార్నీ మనం చేసేవన్నీ లివర్ ను దెబ్బతీసే పనులేనా ?

లివర్ పాడవ్వడానికి ప్రధాన కారణం ఇన్సులిన్ ని బ్యాలెన్స్ చెయ్యలేకపోవడం .  బాడీలో  టాక్సిక్స్ పేరుకుపోవడం వల్ల ఈ ఇబ్బంది కలుగుతుంది


Published Dec 02, 2024 09:53:00 PM
postImages/2024-12-02/1733156664_Untitled35a9c9b35eb.gif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ :  లివర్ ప్రాబ్లమ్స్ ఆల్కహాల్ వల్ల మాత్రమే వస్తాయనుకోవడం మీ భ్రమ. లివర్ పోవడానికి సవాలక్ష కారణాలున్నాయి . అందులో సగం మనం ఇంతకు ముందే చేసేశాం. మరికొన్ని చెయ్యబోతున్నాం . అవేంటో చూసేద్దాం.


లివర్ పాడవ్వడానికి ప్రధాన కారణం ఇన్సులిన్ ని బ్యాలెన్స్ చెయ్యలేకపోవడం .  బాడీలో  టాక్సిక్స్ పేరుకుపోవడం వల్ల ఈ ఇబ్బంది కలుగుతుంది. ఈ ఆల్కహాలిక్ లేని కొవ్వు కాలేయ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి మీ ఆహారంలో చక్కెర పదార్థాలు, పండ్ల రసాలు, సోడా, కుకీలను నివారించండి. ఎక్కువ స్వీట్స్ ..ఎక్కువ జ్యూసులు కూడా లివర్ ను పాడుచేసేస్తాయి.


* కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం కాలేయ ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి వైట్ బ్రెడ్, పాస్తా, రైస్ తో పాటు మనం డైట్ లో తినే చపాతీ రోటీ కూడా ఇదే వర్గానికి చెందుతాయి . కాకపోతే మితిమీరి తినకూడదు.


* వేయించిన మరియు వేయించిన ఆహారాలలో కేలరీలు మరియు కొవ్వులు అధికంగా ఉంటాయి. మనం  ఈ రోజుల్లో తినేవే అవి. KFC, పూరీ ,  ఫ్రెంచ్ ఫ్రైస్ , ఇలా చెప్పుకుంటే పోతే బోలెడు.


*  ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో కూడా అధిక కొవ్వు కాలేయంలో పేరుకుపోయి ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. 


*కొవ్వు కూడా కాలేయంలో పేరుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి రెడ్ మీట్ ఎక్కువగా తినకపోతేనే మంచిది . తిన్నా ...రాత్రి పూట తినకుండా ఉంటే మంచిది.


* సోడియం అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి. ఉప్పు తగ్గించడం కాలేయానికి మంచిది. మీ బ్లడ్ ను కంట్రోల్ చేసే సోడియం పర్ఫెక్ట్ గా ఉండాలి. మీ శరీరంలో ఏది ఎక్కువైన , తక్కువైన ఏమైనా ప్రాబ్లమే. అది బ్యాలెన్స్ చేస్తూ ఉండడమే హెల్దీ లైఫ్ స్టైల్.


* నూడుల్స్‌లో కొన్ని పదార్థాలను ఎక్కువగా వాడటం వల్ల కాలేయం కూడా దెబ్బతింటుంది.నాకు తెలిసి 100 లో 80 శాతం మంది ఇవన్నీ రోజు తినకపోయినా వారం లో ఒకటి రెండు రోజులు తింటారు. అది కూడా ఇప్పుడు ప్రమాదమే. కాబట్టి కాలేయం ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా చూసుకోవాలి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-news food, junk-food

Related Articles