Amala:నాగచైతన్య అఖిల్లా కాదు..అందుకే నేను పెంచలేదు అమల షాకింగ్ కామెంట్స్.!

టాలీవుడ్ ప్రస్తుతం ఈ పొజిషన్ లో ఉంది అంటే దానికి ఎంతో కొంత కారణం అక్కినేని ఫ్యామిలీ. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా చేసిన సమయంలో ఇండస్ట్రీ డెవలప్మెంట్ లో కూడా ఎంతో సహకారం అందించారు. ఆయన అలా చేశారు కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీపై ఆధారపడి ఎంతమంది నటీనటులు బ్రతకగలుగుతున్నారు. అలాంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏఎన్ఆర్ తర్వాత ఆయన నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని నాగార్జున ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగారు. ఇప్పటికి ఆరు పదుల వయస్సు దాటినా కానీ  సినిమాల్లో దూసుకుపోతున్నారు. కానీ  నాగార్జున నట వారసులుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినటువంటి అఖిల్, నాగచైతన్య మాత్రం ఇప్పటికి స్టార్ డం అందుకోలేకపోతున్నారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-04/1720066139_amala.jpg

న్యూస్ లైన్ డెస్క్: టాలీవుడ్ ప్రస్తుతం ఈ పొజిషన్ లో ఉంది అంటే దానికి ఎంతో కొంత కారణం అక్కినేని ఫ్యామిలీ. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా చేసిన సమయంలో ఇండస్ట్రీ డెవలప్మెంట్ లో కూడా ఎంతో సహకారం అందించారు. ఆయన అలా చేశారు కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రీపై ఆధారపడి ఎంతమంది నటీనటులు బ్రతకగలుగుతున్నారు. అలాంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏఎన్ఆర్ తర్వాత ఆయన నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని నాగార్జున ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగారు. ఇప్పటికి ఆరు పదుల వయస్సు దాటినా కానీ  సినిమాల్లో దూసుకుపోతున్నారు. కానీ  నాగార్జున నట వారసులుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినటువంటి అఖిల్, నాగచైతన్య మాత్రం ఇప్పటికి స్టార్ డం అందుకోలేకపోతున్నారు.

 ఈ విధంగా అక్కినేని ఫ్యామిలీ ఓ మోస్తారుగా దూసుకుపోతున్నారు. అయితే వీరి సినిమా గురించి పక్కన పెడితే వారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే  మాత్రం నాగార్జున మొదట రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకున్నారు.  ఆయనకు  నాగచైతన్య పుట్టిన తర్వాత వీరి మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అమలను పెళ్లి చేసుకున్నారు. వీరికి అఖిల్ పుట్టారు. అయితే అమలకు అఖిల్ సొంత కొడుకు కాబట్టి  ఆయనను ఒక రకంగా నాగచైతన్యను ఒక రకంగా చూసుకునేదట.

అయితే అమల నాగచైతన్య గురించి ఒక సందర్భంలో పలు రకాల కామెంట్స్ చేసింది. నాగ చైతన్య అఖిల్ ఒకే రకమైన క్యారెక్టర్లు ఉన్నవారు కాదు. అంతే కాదు నాగచైతన్య నా వద్ద పెరగలేదని వాళ్ళ అమ్మ లక్ష్మీ వద్ద పెరిగారని తెలియజేసింది. అప్పుడప్పుడు హైదరాబాద్ కు వచ్చి  వాళ్ల నాన్నతోనే ఎక్కువ సమయం గడిపే వాడని అన్నది. అఖిల్ నాగచైతన్య  మధ్య మంచి బాండింగ్ ఉన్నదని, అఖిల్ చైతన్యకి ఒక మంచి అన్నయ్య అని,  నాగచైతన్య హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చిన అఖిల్ ఆయన వెనకే తిరిగేవాడని, తన అన్నయ్య చైతన్య ఎప్పుడు వస్తాడా అని అఖిల్ ఎదురుచూసేవాడు అంటూ చెప్పుకొచ్చింది. నాగచైతన్య పెద్దగా నాటి కాదు, అఖిల్ మాత్రం హైపర్ యాక్టివ్ అంటూ తెలియజేసింది. ప్రస్తుతం వీరిద్దరూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఎవరి సినిమా రిలీజ్ అయినా సరే నా గుండెల్లో దడ పుడుతుంది. చిత్రం ఫలితం ఏ విధంగా ఉంటుందో అని వాళ్ల కంటే ఎక్కువ నాకే భయం వేస్తుంది.  అయితే వారు చిత్రం ఫలితం ఏ విధంగా ఉన్నా ఒకటి రెండు రోజుల్లో మర్చిపోయి మళ్లీ నెక్స్ట్ ప్రాజెక్టుపై దృష్టి పెడుతూ ఉంటారు.

ఈ విధంగా అమలకు చైతన్యతో బలమైన అనుబంధం లేకపోయినా కానీ, నాగచైతన్య ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు   అమల అర్థం చేసుకోగలిగింది. ప్రస్తుతం చైతు చందు మొండేటి డైరెక్షన్ లో తండెల్ మూవీని చేస్తున్నారు. ఇందులో సాయి పల్లవి కథానాయకగా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా  త్వరలోనే రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇక అఖిల్ మాత్రం ఇప్పటికీ చేసిన సినిమాల్లో ఏ ఒక్కటి కూడా సూపర్ హిట్ కాలేదు. ఆయనకు ఈ సంవత్సరమైనా ఒక మంచి హిట్ పడుతుందా లేదంటే ఇంకా టైం పడుతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna nagachaitanya akhil-akkineni amala anr

Related Articles