Naga Chaitanya: శోభిత ధూళిపాళతో నాగచైతన్య రెండో పెళ్లి.. ఎంగేజ్మెంట్ ఈ రోజే ?

సినీ నటి శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య డేటింగ్ లో ఉన్నాడనే వార్తలు చాలా కాలంగా వైరల్ అవుతున్నాయి


Published Aug 08, 2024 08:00:00 AM
postImages/2024-08-08/1723084333_maga.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టీటౌన్ లవ్ కపుల్ సమంత , అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత నాగచైతన్య శోభిత ధూళిపాళ తో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. సినీ నటి శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య డేటింగ్ లో ఉన్నాడనే వార్తలు చాలా కాలంగా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి ఉన్న అనేక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూరప్ ట్రిప్ లో రెస్టారెంట్ లో పిక్స్ దొరికేశాయి కూడా..అయినా ఓపెన్ కాలేదు.


రిలేషన్ షిప్ ను పెళ్లి వరకు తీసుకొని వెళ్లాలని ఫిక్స్ అయ్యారట. అయితే ఈ రోజు వారి ఎంగేజ్మెంట్ వార్తపై నాగార్జున ట్వీట్ ద్వారా కాని వీడియో కాని రిలీజ్ చేసే అవకాశముందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఫైనల్ గా నాగ్ మరో సారి పెళ్లి కొడుకు అవుతున్నాడు. లైఫ్ లో మరో అడుగు ధైర్యం గా వేస్తున్నాడంటున్నారు నెటిజన్లు. సోషల్ మీడియా అంతా ఫుల్ వైరల్ అవుతుంది. అతి కొద్ది మందితో ఈ ఎంగేజ్మెంట్ ను చేస్తున్నారని టాక్. అయితే ఇరు ఫ్యామిలీస్ నుంచి అనౌన్స్ మెంట్ ఏం లేదు.


'ఒక వ్యాపారవేత్త కుమార్తెను నాగచైతన్య రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ ఇటీవలి కాలంలో మీడియాలో పలు వార్తలు వచ్చాయి. నేషనల్ మీడియా ఈ రిలేషన్ ను ఎప్పుడో బయటపెట్టేసింది. పెళ్లి మాటలు అప్పుడెప్పుడో ఏప్రిల్ లోనే చెప్పేసింది. ఇండియాలో మాత్రం ఇప్పటికి బయటపెట్టారు. నాగార్జున ట్వీట్ కోసం వెయిట్ చేద్దాం.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna nagachaitanya engagement

Related Articles