"పాలకూర ఉల్లికారం" టేస్ట్ అద్దిరిపోతుంది. చిన్నపిల్లలు తినాలంటే పక్కాగా ట్రై చెయ్యండి సూపర్ అంటే సూపర్.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పాలక్ అనగానే పోషకాలు పుష్కలంగా ఉంటాయని చిన్నపిల్లలకి కూడా తెలుసు. అయితే ఎప్పుడు పాలక్ పప్పు, పాలక్ స్పెషల్స్ లో ఈ రెసిపీ కూడా ట్రై చెయ్యండి. "పాలకూర ఉల్లికారం" టేస్ట్ అద్దిరిపోతుంది. చిన్నపిల్లలు తినాలంటే పక్కాగా ట్రై చెయ్యండి సూపర్ అంటే సూపర్.
మీడియం సైజ్ ఉల్లిపాయలు - 3
నూనె - 1 టేబుల్‌స్పూన్
శనగపప్పు - 1 టీస్పూన్
ధనియాలు - 2 టీస్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
ఎండుమిర్చి - 5 నుంచి 6
చింతపండు - రెండు రెబ్బలు
ఉప్పు - తగినంత
కారం - 2 టీస్పూన్లు
ఫస్ట్ పాలక్ కట్ చేసి పెట్టుకొండి. కొంచెం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొండి. తర్వాత పెనంలో కాస్త శనగపప్పు, ధనియాలు , జీలకర్ర వేసుకొని వేయించుకొండి. అవి కాస్త వేగాక ఎండు మిర్చి వేసుకొని వేయించుకొండి. తర్వాత ఉల్లిపాయలు , ఉప్పు చింతపండు వేసుకొని ఆనియన్స్ బాగా వేగే వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆపుకొండి. ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకొని ఉంచుకొండి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఫ్రెష్‌గా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి కాస్త పోపు వేసుకొండి. ఆపై సన్నగా కట్ చేసిన పాలకూర వేసుకొని బాగా మగ్గనివ్వండి.ఉల్లికారం యాడ్ చేసుకొని మిశ్రమం మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే బాగా కలిసేలా కలుపుకొని ...వేడి వేడి అన్నంలో కలుపుకొండి. కాసింత కారంగా చేసుకొని కూసింత నెయ్యి వేసుకుంటే అధ్భుతం .