pawan kalyan: పవన్ కళ్యాణ్ “OG” నుంచి కొత్త పోస్టర్..!


Published Oct 19, 2024 10:50:00 PM
postImages/2024-10-19/1729358573_110723572.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఓ వైపు ఆంధ్రా డిప్యూటీ సీఎం గా కంటిన్యూ అవుతూనే ..సినిమాలు కూడా చేస్తున్నారు. ఫస్ట్ హరిహరవీరమల్లు చిత్రం పూర్తి చేసిన తరువాత ప్రెస్టీజియస్ చిత్రం “OG” చేయనున్నారు. అభిమానులు ఈ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా “OG” మూవీని దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తుండటంతో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా రానుంది. ఈ మూవీని ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ , వీడియ గ్లింప్స్ భారీ అంచనాలున్నాయి. అందులోను డిప్యూటీ సీఎం అయ్యాక వస్తున్న సినిమాలు కాబట్టి మరింత బజ్ ఏర్పడింది.


తాజాగా ఓ సాలిడ్ కవర్ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ముంబై లోని గేట్ వే ఆఫ్ ఇండియా ముందు విధ్వంసం సృష్టించి మరణ మృదంగం మోగించిన ఓజీని మనకు ఇందులో చూపెట్టారు. పవన్ ని డార్క్ షేడ్స్ లో చూపెట్టినా.. అభిమానులకు ఈ కవర్ పోస్టర్ పిచ్చిగా ఎక్కేసింది. ఈ దారులు తిరిగి ఎప్పటికీ మళ్లీ అలా కనిపించవు అనే క్యాప్షన్ ను ఈ పోస్టర్ కు జత చేశారు.


డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ మంచి స్పీడు గా పనులు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్  సినిమా లు ఇఫ్పుడు తెలుగు రాష్ట్రాల్లో  పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : pawankalyan newslinetelugu

Related Articles