AANI MASTER: అసలు జానీ మాస్టర్ దగ్గరకు ఆమెను పంపిందే నేను ..అనీ మాస్టర్ !

జానీ మాస్టర్ ఇష్యూపై నోరెత్తారు . చాలా రోజులుగా ఈ విషయం చూస్తున్నానని ...ఆ అమ్మాయి ఇలా చేయడం కరెక్ట్ కాదని అన్నారు.


Published Oct 18, 2024 07:02:00 PM
postImages/2024-10-18/1729258466_animasterjanimaster11729239979.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జానీ మాస్టర్ ఇష్యూపై నోరెత్తారు . చాలా రోజులుగా ఈ విషయం చూస్తున్నానని ...ఆ అమ్మాయి ఇలా చేయడం కరెక్ట్ కాదని అన్నారు.  ఈ కేసు రోజుకో రకంగా మలుపులు తిరుగుతుంది.ఈ కేసు కారణంగా జానీ మాస్టర్ కు రావాల్సిన నేషనల్ అవార్డు ను కూడా క్యాన్సిల్ చేశారు. దీనితో పలువురు కొరియోగ్రాఫర్స్ దీనిపై స్పందించారు. ఇప్పటికీ కూడా ఆ కేసు తేలలేదు. ప్రస్తుతం జానీ మాస్టర్ చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్నారు.


అయితే జానీ మాస్టర్ తల్లి ప్రస్తుతం గుండెపోటుతో హాస్పిటిల్ లో పాలయ్యారు. ఇలా జానీ  మాస్టర్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి . దీంతో లేడీ కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ ఇన్ని రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. జానీ మాస్టర్ చాలా కష్టపడి ఈ స్థాయిలోకి వచ్చారు. ఈ విషయం తేలకముందే జానీ మాస్టర్ నేషనల్ అవార్డు క్యాన్సిల్ చెయ్యడం చాలా బాధాకరం అని అన్నారు.


తాజాగా అనీ మాస్టర్ జానీ మాస్టర్ కేసు విషయంలో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఎవరైతే జానీ మాస్టర్ పైన కేసు నమోదు చేశారో.. ఆ యువతి తనకు తెలుసంటూ.. అవకాశాల కోసం ఆమెకు తరచూ మెసేజ్ చేసేదంటూ చెప్పుకొచ్చారు. జానీ మాస్టర్ నెంబర్ నేను ఇచ్చి తన దగ్గరకు వెళ్లమని చెప్పానని ...అవకాశాలు వచ్చాక ఇలా ఇరికించడం చాలా బాధాకరం అని తెలిపారు. అన్యాయం జరిగి ఉంటే అప్పుడు బయటకు రావాలని అన్నీ జరిగిన తర్వత ఇప్పుడు ఇలా కేసు వేయడం పక్కా ప్లాన్ లా అనిపిస్తుందని అన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : national-film-awards jani-master jani-master-arrest

Related Articles