Shekar Basha: వార్నీ ..ఆ కేసులో శేఖర్ హస్తం ఉందా ..శేఖర్ బాషా అరెస్ట్..!

ఆర్‌జే శేఖ‌ర్ బాషాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఒక కేసులో భాగంగా అతనిని అదుపులోకి తీసుకున్నారు


Published Oct 19, 2024 10:28:00 PM
postImages/2024-10-19/1729357139_Shekarbasha.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  శేఖర్ భాషా ఇప్పుడు మంచి ఫేమ్ లో ఉన్నాడు. నిజానికి బిగ్ బాస్ కంటెస్టెంట్ రీసెంట్ గా బయటకు వచ్చాడు. పాపం కుళ్లు జోక్స్ తో బిగ్ బాస్ ఆడియన్స్ ను బాగానే నవ్వించాడు. కాని ఓటింగ్ లో చాలా తక్కువ ఓట్లు రావడంతో బయటకు వచ్చేశాడు.


బిగ్ బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ కంటెస్టెంట్ ఆర్‌జే శేఖ‌ర్ బాషాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఒక కేసులో భాగంగా అతనిని అదుపులోకి తీసుకున్నారు. శేఖర్ బాషాను విచారిస్తున్నట్లు సమాచారం.యూట్యూబర్ హర్ష సాయి పై ఒక అమ్మాయి పోలీసు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తన‌పై లైంగికంగా దాడి చేయ‌డంతో పాటు మానసికంగా వేధించాడంటూ ఆ యువతి సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను ఆశ్రయించింది. 


సెక్షన్ 376, 354, 328 కింద హర్ష సాయిపై కేసులు నమోదు చేశారు. అయితే పోలీసు కేసు నమోదు అయినప్పటి నుంచి హర్ష సాయి కన్పించకుండా పోయాడు. హర్షసాయి కోసం పోలీసులు లుక్ అవుట్ కూడా ఇష్యూ చేశారు. కాని హర్షాసాయి బయటకు రాలేదు. సో ఈ విషయం పై విచారణ జరపడానికే శేఖర్ భాషాను అరెస్ట్ చేశారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu youtuber shekar-basha harsha-sai

Related Articles