దీని ద్వారా ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవించవచ్చు. నెమలి అదృష్టానికి చిహ్నం
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తక్కువో ...ఎక్కువో ఆర్ధిక సమస్య లేని ఇళ్లు ఉంటుందా. స్థాయిని బట్టి సమస్య కూడా ఉంటుంది. అయితే ఆర్ధిక సమస్యలు తీరడానికి మాత్రం నెమలి విగ్రహాలను ఇంట్లో ఉంచుకుంటే డబ్బులకు ఇబ్బంది ఉండదని పండితులు అంటుంటారు. నెమలి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. దీని ద్వారా ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవించవచ్చు. నెమలి అదృష్టానికి చిహ్నం . ఇంట్లో నెమలి బొమ్మ ఉండడంవల్ల సమస్యలకు దూరంగా ఉంటాం.
* వివాహ అడ్డంకులు ఉన్నట్లయితే, నెమలి విగ్రహాన్ని ఇంట్లో తప్పకుండా పెట్టాలి.
* ఎప్పుడైతే నెమలి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుతారో ఆర్థిక సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. దీనితో సంతోషంగా జీవించవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి విగ్రహాన్ని ఈశాన్య దిశలో పెట్టడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందట.
* వెండి విగ్రహం కాని..మట్టి విగ్రహం కాని నెమలి బొమ్మను ఇంట్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మానసిక ఆనందం పొందితే ఆర్ధిక స్థిరత్వం అదే వస్తుంది.