Prabhas: ప్రభాస్ పెళ్లి గురించి గుడ్ న్యూస్.. అభిమానులకు పండగే.!

కల్కి సినిమాతో ఇన్ని రోజులు తన మీద ఉన్న బ్యాడ్ నేమ్ తొలగించుకున్నాడు ప్రభాస్. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి ప్రభాస్ సినీ కెరీర్ ముగిసిపోయింది అని, చేసిన సినిమాలు ఇక హిట్ అవ్వవు అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. అయితే ఆయన చేసిన కామెంట్లకు తగ్గట్టే ప్రభాస్ నటించిన వరుస సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక ఆ మధ్యకాలంలో సలార్ హిట్ అయినప్పటికీ ఆ టైంలో కూడా ఒక్క సినిమా హిట్ అయితే హిట్ అయినట్టు కాదు నటించిన అన్ని సినిమాలు హిట్ అవ్వాలి అంటూ మరో పెద్ద బాంబు పేల్చారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-07/1720366658_prabha.jpg

న్యూస్ లైన్ డెస్క్: కల్కి సినిమాతో ఇన్ని రోజులు తన మీద ఉన్న బ్యాడ్ నేమ్ తొలగించుకున్నాడు ప్రభాస్. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి ప్రభాస్ సినీ కెరీర్ ముగిసిపోయింది అని, చేసిన సినిమాలు ఇక హిట్ అవ్వవు అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. అయితే ఆయన చేసిన కామెంట్లకు తగ్గట్టే ప్రభాస్ నటించిన వరుస సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక ఆ మధ్యకాలంలో సలార్ హిట్ అయినప్పటికీ ఆ టైంలో కూడా ఒక్క సినిమా హిట్ అయితే హిట్ అయినట్టు కాదు నటించిన అన్ని సినిమాలు హిట్ అవ్వాలి అంటూ మరో పెద్ద బాంబు పేల్చారు.

దీంతో ప్రభాస్ అభిమానుల్లో చాలా వరకు నిరాశ ఏర్పడింది.అంతేకాదు ప్రభాస్ కి పెళ్లి జీవితం కూడా కలిసి రాదని,అసలు ఆయనకు పెళ్లి జరగదు అంటూ వేణు స్వామి చేసిన కామెంట్స్ ఎంతోమంది అభిమానులను కలిచి వేసాయి.అయితే వేణు స్వామి చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్న వేళ కల్కి 2898AD మూవీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టడంతో జ్యోతిష్యుడు వేణు స్వామిని అందరూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో వేణు స్వామి సెలబ్రిటీల గురించి ఏ ఇంటర్వ్యూలో కూడా బహిరంగ వ్యాఖ్యలు చేయను అని క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు.

అయితే వేణుస్వామి ప్రభాస్ గురించి మాట్లాడిన మాటలపై ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి సైతం ఫైర్ అయింది.ఇక ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా కల్కి మూవీ హిట్ అయ్యాక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్యామలా దేవికి ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది.ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని అడగగా.. ప్రభాస్ రేంజ్ ఎలాంటిదో కల్కి మూవీతో మరొకసారి ప్రూవ్ అయింది. అయితే ఎవరో ప్రభాస్ సినిమాలు హిట్ అవ్వని చెప్పారు.కానీ ఆయన చెప్పిన విషయాలు నిజం అవ్వడం లేదు.ఆయన చెప్పిన విషయాలను తలకిందులు చేస్తూ ప్రభాస్ హిట్టు కొట్టాడు.ఇక సినిమా హిట్ అయినట్టే ప్రభాస్ పెళ్లి కూడా త్వరలోనే జరుగుతుంది.ఆయన పెళ్లి జరగాలని మేము అందరం కోరుకుంటున్నాం.

ఇక ప్రభాస్ పెళ్లి చేయాలని మేము కూడా ఆత్రుతగానే ఎదురు చూస్తున్నాం.కానీ అన్నింటికి టైం రావాలి మంచి సమయం వస్తుంది అనే నమ్మకంతోనే మేమున్నాం. కృష్ణంరాజు పైనుంచి మొత్తం చూసుకుంటారు. ఇప్పటివరకు ఆయన అనుకున్న విషయాలన్నీ జరిగాయి ఇది కూడా జరుగుతుంది అంటూ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ప్రభాస్ పెళ్లిపై శుభవార్త చెప్పింది. దీంతో ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు

newsline-whatsapp-channel
Tags : prabhas newslinetelugu kalki marriage venuswamy shyama-devi

Related Articles