Prabhas:దోస్త్ మేరా దోస్త్.. గోపీచంద్ మూవీలో ప్రభాస్.!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  కేవలం ఇండియాలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా  స్టార్డం సంపాదించుకున్నారు. ప్రస్తుతం కల్కి సినిమా ద్వారా ఆయన రేంజ్ ఇంకెక్కడికో వెళ్లిపోయింది. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఆయనను దాటి వెళ్లే హీరోలు లేరని చెప్పవచ్చు. ఈ విధంగా  కెరియర్ లో దూసుకుపోతున్న ప్రభాస్ ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన హీరో. తాను పుట్టిన పెరిగిన  మూలాలని అస్సలు మర్చిపోరు. అలాంటి ప్రభాస్ కు ఇండస్ట్రీలో  ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు.  


Published Jul 17, 2024 10:50:00 AM
postImages/2024-07-17/1721192540_prabha1.jpg

న్యూస్ లైన్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  కేవలం ఇండియాలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా  స్టార్డం సంపాదించుకున్నారు. ప్రస్తుతం కల్కి సినిమా ద్వారా ఆయన రేంజ్ ఇంకెక్కడికో వెళ్లిపోయింది. ఇక తెలుగు ఇండస్ట్రీలో ఆయనను దాటి వెళ్లే హీరోలు లేరని చెప్పవచ్చు. ఈ విధంగా  కెరియర్ లో దూసుకుపోతున్న ప్రభాస్ ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం కలిగిన హీరో. తాను పుట్టిన పెరిగిన  మూలాలని అస్సలు మర్చిపోరు. అలాంటి ప్రభాస్ కు ఇండస్ట్రీలో  ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు.  

ఆయన ఎవరో కాదు హీరో గోపీచంద్. వీరిద్దరి ఫ్రెండ్షిప్ ప్రభాస్ ఇండస్ట్రీలో స్టార్ అవ్వకముందు నుంచే ఉంది. వర్షం సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. అందులో ప్రభాస్ హీరోగా చేస్తే గోపీచంద్ విలన్ గా చేశారు. అలా వీరి స్నేహం  ఇండస్ట్రీలోనే గొప్ప స్నేహంగా చెప్పుకోవచ్చు. అలాంటి స్నేహితుడి కోసం  ప్రభాస్ చిన్న త్యాగం చేయబోతున్నారట. ఆ వివరాలు ఏంటో చూద్దాం.  తాజాగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కి మూవీ  అద్భుతమైన హిట్ సాధించి, భారీ కలెక్షన్స్ కూడా వసూలు చేసింది.  దీంతో ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం కల్కి సీక్వెల్ గా వచ్చే కల్కి2 సినిమా షూటింగ్ కూడా  త్వరలోనే ప్రారంభం కాబోతోంది.  ఇదే తరుణంలో ప్రభాస్, సాలార్ 2, ది రాజా సాబ్, స్పిరిట్ సినిమాలకు లైన్ అప్ చేశాడు. అలాగే మంచు విష్ణు హీరోగా వస్తున్నటువంటి కన్నప్ప సినిమాలో కూడా గెస్ట్ రోల్ లో చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ విధంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ తన ఫ్రెండ్ అయినటువంటి గోపీచంద్ సినిమాలో కనిపించబోతున్నట్టు సమాచారం. అయితే గోపీచంద్ గత కొంతకాలంగా డిజాస్టర్ లతో సతమతమవుతున్నారు.  అలాంటి గోపీచంద్ డైరెక్టర్ శీను వైట్ల ఒక సినిమా చేస్తున్నారు. ఇది గోపీచంద్ కు మరియు దర్శకుడు శ్రీను వైట్లకు  కీలకమైన మూవీ అని చెప్పవచ్చు.  అయితే ఈ సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్ చేయడం కోసం గోపీచంద్ అడిగారట.

తన ఫ్రెండ్ అడిగితే ప్రభాస్ కాదన లేడు కాబట్టి, ఈ సినిమాలో ఆయన గెస్ట్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.  దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.  అయితే ఈ సినిమా పేరు "విశ్వం" అని, ఇందులో ప్రభాస్ గెస్ట్ రోల్ లేదంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నారని  అంటున్నారు. మరి చూడాలి దీనిపై అధికారిక ప్రకటన వస్తే కానీ  క్లారిటీ రాదు.

newsline-whatsapp-channel
Tags : prabhas newslinetelugu kalki gopichand vishwam srinu-vaitla

Related Articles