ప్రీ బుకింగ్స్ కూడా తాజాగా ఈ ప్రీ సేల్ బుకింగ్స్ ఓపెన్ చేయగా, అందులో ఈ మూవీ టికెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయట.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: డ్రీమ్ కమ్స్ ట్రూ లాగా ...ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న పుష్ప -2 ఎట్టకేలకు బుకింగ్స్ స్టేజ్ కి వచ్చేసింది. అది కూడా ఏదో అల్లాటప్పాగా కాదు .. గంటలోనే వేల టికెట్లు బుక్ అయ్యాయి. డిసెంబర్ 5న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. ప్రీ బుకింగ్స్ కూడా తాజాగా ఈ ప్రీ సేల్ బుకింగ్స్ ఓపెన్ చేయగా, అందులో ఈ మూవీ టికెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయట.
ఓవర్సీస్‌లో ఇప్పటికే ప్రీ సేల్ బుకింగ్స్‌లో జోరు చూపించిన ఈ సినిమా తాజాగా నార్త్‌లోనూ ఓ రేంజ్లో అమ్ముడువుతున్నాయని సినీ వర్గాల మాట.హిందీ వెర్షన్ లో సినిమా టికెట్లు ఓపెన్ చెయ్యగానే బుక్ స్పీడ్ గా బుక్ అవుతున్నాయట. 24 గంటల్లోనే ఏకంగా లక్ష టికెట్స్ సేల్ అయ్యాయట. బుకింగ్స్ లో పుష్ఫ -2 ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు టైగర్3 (65,000), యానిమల్ (52,500), డంకీ (42,000), స్త్రీ 2 (41,000) సినిమాలను 'పుష్ప2' బీట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాల్లో పుష్పథర్డ్ ప్లేస్ లో ఉంది.మరోవైపు ఈ సినిమా ప్రీసేల్ బుకింగ్స్‌లోనే ఇప్పటికే రూ.60కోట్లకు పైగా వసూలు చేసిందని టాక్.
ఈ రోజు హైదరాబాద్‌లో ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఉంది . దీని కోసం సుమారు ఎనిమిది వేల మందికి పాసులు జారీ చేశారని సమచారం. అయితే ఈ ప్రోగ్రామ్‌కు చీఫ్ గెస్ట్‌గా ఎవరు రానున్నారన్న విషయంపై ఆసక్తి నెలకొంది.