గ్లోబల్ స్టార్ మాత్రమే కాదు, ప్లానెట్ స్టార్ అని... దీనికి మూడు కారణాలున్నాయని వర్మ తెలిపారు. ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ ఈ పోస్ట్ ను తెగ షేర్లు చేసేస్తున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వివాదం అంటే ఆర్జీవీ ...ఆర్జీవీ అంటే వివాదం . రామ్ గోపాల్ వర్మకు కొత్తేమీ కాదు ప్రతి విషయంలో కాంట్రవర్సీలు మాట్లాడడం . రీసెంట్ గా పుష్ప-2 టికెట్ల రేట్లపై కామెంట్ చేశారు. అదే వైరల్ అవుతుంటే మెగా కంటే అల్లు ఎన్నో రెట్లు మెగా అని... ఆయన కేవలం గ్లోబల్ స్టార్ మాత్రమే కాదు, ప్లానెట్ స్టార్ అని... దీనికి మూడు కారణాలున్నాయని వర్మ తెలిపారు. ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ ఈ పోస్ట్ ను తెగ షేర్లు చేసేస్తున్నారు.
ఇండియన్ సినిమా హిస్టరీలోనే 'పుష్ప-2' అత్యంత భారీగా విడుదల కాబోతోందని వర్మ అన్నారు. ఈ సినిమా తొలిరోజు వసూళ్లు బాక్సాఫీస్ ప్రపంచంలోని స్ట్రాటోస్పియర్ ని బ్రేక్ చేస్తాయని చెప్పారు. పుష్ప సినిమా యావత్తు ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లోను రిలీజ్ అవుతుంది. సో దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ ఇంకా ఫేమస్ అంటూ కామెంట్ చేశాడు.
మూడో కారణం... 'పుష్ప-2' చిత్రానికి అల్లు అర్జున్ 287 కోట్ల 36 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నారు. ఇంత రెమ్యూనిరేషన్ ఎవ్వరు తీసుకోలేదు. గ్లోబల్ స్టార్ కూడా ..అల్లు గ్రేట్ అంటూ కామెంట్ చేశారు ఆర్జీవీ.