న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ మధ్య ఆర్జీవీ అన్ని టాపిక్స్ లోను మంచి హాట్ టాపిక్ నిలుస్తున్నారు . ఇన్నాళ్లు ఫేక్ ఫొటోస్ కేసులో ఉరుకులు పరుగులు పెడితే కోర్టు కాస్త టైం ఇచ్చింది. ఇప్పుడు మరో సారి పుష్ప టికెట్లు ధర పెంచడంపై సెటైర్స్ వేశారు ఆర్జీవీ. ఎక్స్ లో టికెట్ రేట్లు పై ఓ స్టోరీ కూడా చెప్పాడు. ఆ స్టోరీ అర్ధం అంతా ఒక్కటే ..రేట్లు పెంచడం లో తప్పు లేదు.
ఇంతకీ ఆర్జీవీ చెప్పిన స్టోరీ ఏంటంటే సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. టేస్టీ తో పాటు చాలా అరుదైన ఇడ్లీలు గా అనుకొని రేట్లు పెంచాడు. కాని కస్టమర్ కు కస్టమర్ కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే మాత్రం ..ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే మరో హోటల్ కు వెళ్తాడు. అప్పుడు నష్టపోయేది మాత్రం సుబ్బారావే. కాని రేట్లు పెంచడం లో తప్పు లేదు అని స్ట్రైట్ గా చెప్పేశాడు.
ఒకవేళ “సెవెన్‌స్టార్ హోటల్‌లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం” అని వాదిస్తే మాత్రం మీ అంత మూర్ఖత్వం మీదే. డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి, అంతే కానీ ప్రజా సేవ కోసం కాదు.
అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ వున్నప్పుడు , ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే. మల్లి సుబ్బారావు హోటల్ చైన్ విషయం కొస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది .. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బా రావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు, అన్ని సీట్లు బుక్ అయిపోయాయి.. కాబట్టి టికెట్ రేటు పెంచడం లో తప్పు లేదు.
పుష్ప 2 ఇడ్లీలు #Pushpa2
సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు.
కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు… — Ram Gopal Varma (@RGVzoomin) December 4, 2024