PUSHPA : అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ..ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ !

పుష్ప2 ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు.నవంబర్‌ రెండో వారంలో పుష్ప-2 ట్రైలర్‌ను లాంచ్‌ చేయాలని అల్లు అర్జున్‌-సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారట.


Published Oct 03, 2024 10:01:00 PM
postImages/2024-10-03/1727973145_sddefault.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ . పుష్ప2 ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు.నవంబర్‌ రెండో వారంలో పుష్ప-2 ట్రైలర్‌ను లాంచ్‌ చేయాలని అల్లు అర్జున్‌-సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారట. ఇది కూడా అఫిషియల్ ఏం కాదు కాని ...ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ న్యూస్ . సుకుమార్  టీం అనౌన్స్ చెయ్యలేదు కాని ...ఇండస్ట్రీ లో టాక్.


పుష్ప లాంటి బ్లాక్‌ బాస్టర్‌...పార్ట్‌-2గా వస్తున్న పుష్ప-2 ది రూల్‌ అంతకు మించి అనే అంచనాలు ఉన్నాయి. అంచనాలు అందుకోవడానికి సుక్కు.. ఎంతో జాగ్రత్తగా, పకడ్బందీగా ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ సారి వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.అల్లు అర్జున్‌ ఆర్మీ తల్చుకుంటే.. ట్రైలర్‌ రికార్డులు బద్దలు కొట్టడం పెద్ద కష్టమేమి కాదు.


ఈ మధ్య అల్లుఅర్జున్ మీద చాలా నెగిటివిటీ స్పెడ్ అయ్యింది. ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చెయ్యలేదనే గ్రడ్జ్ పవన్ ఫ్యాన్స్ లో ఉంది. మరి  ఈ విషయం సినిమా మీద ఎమైనా ఎఫెక్ట్ చేస్తుందేమో చూడాలి. ఇటు జానీ మాస్టర్ విషయంలోను అల్లుఅర్జున్, సుకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. నిజానిజాలు ఎలా ఉన్నా...రూమర్స్ మాత్రం గట్టిగా స్పెడ్ అవుతుంది. చూద్దాం సినిమా మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu allu-arjun sukumar pushpa2 icon-star

Related Articles