Keerthy Suresh:"రఘు తాత"లో అలాంటి సీన్స్ ఉంటాయి..అర్థం చేసుకోండి.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ టెన్ హీరోయిన్ లలో కీర్తి సురేష్ కూడా ఒకరు.  ఎలాంటి కథాచిత్రమైన అందులో నటించడం కాదు, జీవిస్తుంది అని చెప్పవచ్చు. అలాంటి కీర్తి సురేష్ ఏ సినిమా చూసిన చాలా డిఫరెంట్ కథలు ఉండే దాంట్లోనే నటిస్తుంది. అలాంటి కీర్తి సురేష్ ఎప్పుడు ఏదో ఒక మెసేజ్ ఉన్న సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తుంది. ముఖ్యంగా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో  పవర్ ఫుల్ క్యారెక్టర్లు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహానటి, మిస్ ఇండియా, పెంగ్విన్  వంటి చిత్రాలు ఉన్నాయి.  


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-21/1721567301_raghu.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ టెన్ హీరోయిన్ లలో కీర్తి సురేష్ కూడా ఒకరు.  ఎలాంటి కథాచిత్రమైన అందులో నటించడం కాదు, జీవిస్తుంది అని చెప్పవచ్చు. అలాంటి కీర్తి సురేష్ ఏ సినిమా చూసిన చాలా డిఫరెంట్ కథలు ఉండే దాంట్లోనే నటిస్తుంది. అలాంటి కీర్తి సురేష్ ఎప్పుడు ఏదో ఒక మెసేజ్ ఉన్న సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తుంది. ముఖ్యంగా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో  పవర్ ఫుల్ క్యారెక్టర్లు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహానటి, మిస్ ఇండియా, పెంగ్విన్  వంటి చిత్రాలు ఉన్నాయి.  

అలా ఈ చిత్రాల ద్వారా ఎంతో గుర్తింపు పొందిన కీర్తి సురేష్ మరో ఉమెన్ సెంట్రిక్  మూవీతో మన ముందుకు వస్తోంది. ఆ చిత్రం పేరు "రఘుతాత". అయితే ఇందులో కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తోందని ఇప్పటికే టీజర్ కూడా విడుదలైంది. అయితే ఇదే తరుణంలో టీజర్ పై కొన్ని వివాదాలు బయటకు వచ్చాయి.  దీనిపై స్పందించిన కీర్తి సురేష్  కథ గురించి అసలు విషయాలు బయట పెట్టింది. రఘు తాత మూవీని విభిన్నమైనటువంటి స్టోరీ తో తెరకెక్కించాం. ఒక మహిళ సమాజంలో ఎదుర్కొనే సవాళ్ల గురించి మాత్రమే ఈ చిత్రంలో ఉంటుంది. ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కోసమే ఈ సినిమా తీసుకు వస్తున్నాం కానీ  ఇందులో రాజకీయపరమైన వివాదాలు ఏమీ లేవని సినిమా అంతా కామెడీ సీన్స్ మాత్రమే ఉంటాయని తెలియజేసింది.

ఇక సినిమా పాటల విషయానికి వస్తే చాలా అద్భుతంగా ఉంటాయని  ఈ ఆడియో విడుదల కోసం నేను కూడా ఎదురుచూస్తున్నానని అన్నది. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే చిత్రమని  ఈ మూవీని హోమ్ బాలే ఫిల్మ్ సంస్థ నిర్మిస్తోందని తెలియజేసింది. ఒక సంకల్పంతో ఉన్నటువంటి స్త్రీ చేసే స్ఫూర్తిదాయక పోరాట కథ ఇందులో చూపించామని  ఆమె అన్నది.  అయితే ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన విడుదలకు సిద్ధమయింది. ఇక కీర్తి సురేష్ విషయానికి వస్తే  తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా వరుస చిత్రాలు చేస్తూ  అద్భుతంగా దూసుకుపోతోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu mahanati raghuthatha home-bole-film

Related Articles