కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండటమే బెటర్ అని అధికారులు సూచించారు.
న్యూస్ లైన్ డెస్క్ : రాష్ట్రంలో అల్పపీడన ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు సాయంత్రం తర్వాత సిరిసిల్ల, ఆదిలాబాద్, నిర్మల్, అసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కొత్తగూడెం, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
భారీ వర్షంతో పాటు.. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండటమే బెటర్ అని అధికారులు సూచించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సైతం భారీ వర్షం కురుస్తుందని.. వాహనాదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.