RAJMOULI: రాజమౌళి.. మహేష్‌ బాబు సినిమాకు ముహూర్తం ఫిక్స్

RRR సినిమా తర్వాత రాజమౌళి ( RAJMOULI)  తన తర్వాత సినిమా కోసం జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసలే నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో అని చెప్పారు. సినిమా  గురించి మరో బిగ్ అప్ డేట్ వచ్చింది. సినిమాలో నటించే ఆర్టిస్ట్ లతో పాటు మూవీ ప్రారంభానికి సంబందించి కూడా ఓ అప్ డేట్ రివీల్ అయ్యింది.ఇండియన్‌ సినిమాలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్న మహేష్‌ బాబు( MAHESH BABU) , రాజమౌళి సినిమా స్టార్ట్ కాబోతుంది. మార్వేల్ రేంజ్ సినిమా అంటున్నారు. అందులోను రాజమౌళి ..ఏం చేసినా వర్కవుట్ అయిపోతుందనే నమ్మకం ఒకటి మార్కెట్ లో  చక్కర్లు కొడుతుంది.


Published Jul 03, 2024 10:11:55 AM
postImages/2024-07-03/1719990668_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : RRR సినిమా తర్వాత రాజమౌళి ( RAJMOULI)  తన తర్వాత సినిమా కోసం జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసలే నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో అని చెప్పారు. సినిమా  గురించి మరో బిగ్ అప్ డేట్ వచ్చింది. సినిమాలో నటించే ఆర్టిస్ట్ లతో పాటు మూవీ ప్రారంభానికి సంబందించి కూడా ఓ అప్ డేట్ రివీల్ అయ్యింది.ఇండియన్‌ సినిమాలోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్న మహేష్‌ బాబు( MAHESH BABU) , రాజమౌళి సినిమా స్టార్ట్ కాబోతుంది. మార్వేల్ రేంజ్ సినిమా అంటున్నారు. అందులోను రాజమౌళి ..ఏం చేసినా వర్కవుట్ అయిపోతుందనే నమ్మకం ఒకటి మార్కెట్ లో  చక్కర్లు కొడుతుంది.


జంగిల్‌ ( JUNGLE )అడ్వెంచరస్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్‌ జరుగుతుంది.  కేఎల్‌ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్ల టీమ్‌ ( TECHNICIAN TEAM) ఆల్‌ రెడీ సెట్‌ అయ్యిందట. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంఎం కీరవాణి ఫైనల్‌ అని తెలుస్తుంది. సినిమాటోగ్రాఫర్‌గా పీఎస్‌ వినోద్‌, ఎడిటర్‌గా తమ్మిరాజు, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా మోహన్‌ నాథ్‌ బింగిని,  మరోవైపు వీఎఫ్‌ఎక్స్ కమల్‌ కన్నన్‌ లను ఫైనల్ చేసుకున్నట్లు ఇండస్ట్రీ టాక్. 


 ఇందులో భారీ కాస్టింగ్‌ ఉండబోతుందనే ప్రచారం మొదట్నుంచి జరిగింది. తాజాగా ఇందులో కీలక పాత్ర కోసం మలయాళ స్టార్‌ హీరో, `సలార్‌`( SALAR)  నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పేరు వినిపిస్తుంది. సినిమాలో మహేష్‌ బాబు తలపడేది ఆయనతోనే అని తెలుస్తుంది. సలార్ లో ప్రభాస్ తో జతకట్టాక ...మహేష్ కు తగ్గ మరో హీరో ...పృథ్వీ రాజ్ ( PRUDHVI RAJ)  మాత్రమే అని రాజమౌళి ఫీలవుతున్నారట. అన్ని లాంగ్వేజెస్ నుంచి ఒక్కో స్టార్ ఆర్టిస్ట్ లను తీసుకోవాలనుకుంటున్నారు. బాలీవుడ్‌ నుంచి హృతిక్‌ గెస్ట్ రోల్‌ ,ఇండోనేషియన్‌ నటి చెల్సియాని హీరోయిన్‌గా అనుకున్నారట. సినిమాకు ఆగష్టులో కొబ్బరికాయ కొట్టేస్తారంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు బాబాయ్ ఆది శేషగిరిరావు తెలిపారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu prudhvi-raj mahesh-babu

Related Articles