Ramam Raghavam : ధనరాజ్ డైరక్ట్ చేసిన ‘రామం రాఘవం’ మూవీ రివ్యూ !

ఈ సినిమా రేపు ఫిబ్రవరి 21 తెలుగు , తమిళ్ లో రిలీజ్ అవుతుంది. ఈ రోజు మీడియాకు ప్రీమియమ్ షో వేశారు. డైరెక్టర్ గా ధనరాజ్ ఏడిపించేశారు. కథ లోకి వెళ్తే..


Published Feb 20, 2025 06:24:00 PM
postImages/2025-02-20/1740056210_raghavan.jpg.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : సినిమాల్లో కమెడియన్ గా , జబర్ధస్త్ షో లో ఆర్టిస్ట్ గా ..బిగ్ బాస్ కంటెస్టెంట్ గా చాలామందికి ధన్ రాజ్ తెలుసు. అయితే రీసెంట్ గా ధనరాజ్ డైరక్టర్ గా మారి సినిమా ‘రామం రాఘవం’. ధనరాజ్, సముద్రఖని మెయిన్ లీడ్స్ లో ధనరాజ్ ఇంపార్టెంట్ రోల్ లో సినిమా చేశారు. ఈ సినిమా రేపు ఫిబ్రవరి 21 తెలుగు , తమిళ్ లో రిలీజ్ అవుతుంది. ఈ రోజు మీడియాకు ప్రీమియమ్ షో వేశారు. డైరెక్టర్ గా ధనరాజ్ ఏడిపించేశారు. కథ లోకి వెళ్తే..


దశరథ రామం(సముద్రఖని)కి కొడుకు రాఘవ(ధనరాజ్) పుట్టినప్పట్నుంచి అతనిపై ప్రేమ ఎక్కువ. రామం రిజిస్ట్రార్ ఆఫీస్ లో చాలా నిజాయితీ ఉద్యోగి . రాఘవ మాత్రం చదువు రాక ఏ పని చేయక బేవర్స్ గా తిరుగుతూ ఉంటాడు. రాఘవ డబ్బులు కోసం చాలా తప్పులు చేస్తుంటాడు.చివరికి డబ్బుల కోసం వాళ్ళ నాన్న సంతకం ఫోర్జరీ చేస్తాడు రాఘవ. ఈ సంగతి రామంకి తెలిసి రాఘవని కొట్టి పోలీసులకు అప్పగిస్తాడు. ఈ కారణంతో రాఘవ తన తండ్రిని చంపేద్దామనుకుంటాడు. లారీ డ్రైవర్ తో డీల్ మాట్లాడతాడు కూడా. అయితే చనిపోయాడా లేదా ...ఈ మధ్యలో లవ్ ట్రాక్ ఎలా నడిపించాడు ఇదే స్టోరీ.


సెకండ్ హాఫ్ అందరూ అనుకున్నట్టు కాకుండా ట్విస్టులు ఇస్తారు. వరుసగా ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తారు. ఒక తండ్రి – కొడుకు ఎమోషన్ కథలో ఇలా ట్విస్టులు పెట్టడం ఇదే మొదటిసారి అనుకోవచ్చు. ప్రీ క్లైమాక్స్ నుంచి ప్రేక్షకులు కచ్చితంగా ఏడుస్తారు. ధనరాజ్ కథతో ఏడిపించేస్తాడు. నాన్న ఎమోషన్ లో ఏముంటుందనిపించినా క్లైమాక్స్ లో చాలా బాగా వర్కవుట్ అయ్యింది.తండ్రి – కొడుకు ఎమోషన్ కథలంటే నాన్నకు ప్రేమతో, యానిమల్ లాంటి సినిమాలే కాదు ఇలాంటి రామం రాఘవం సినిమా కూడా. తండ్రి క్యారెక్టర్ ని – కొడుకు క్యారెక్టర్ ని ఎవరూ ఊహించని విధంగా చాలా బాగా రాసుకున్నారు.  రామం, రాఘవం ఈ రెండు పదాలకు రాముడు అనే అర్ధం. అంటే రెండు పదాలు ఒకటే.  చివర్లో టైటిల్ కి మంచి డైలాగ్ తో జస్టిఫికేషన్ ఇచ్చారు.


ఈ సినిమాలో ఒక సీరియస్ పాత్రలో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక తండ్రి పాత్రలో సముద్రఖని తన వందశాతం ఇచ్చారు. మధర్ క్యారక్టర్ లో ప్రమోదిని కూడా ఎమోషన్ పండించారు. సత్య అక్కడక్కడా నవ్వించడానికి ప్రయత్నం చేశాడు. హరీష్ ఉత్తమన్ కూడా తన పాత్రలో బాగానే నటించాడు. పృథ్వీ రాజ్ , సునీల్ , మోక్ష , శ్రీనివాస్ రెడ్డి మిగిలిన నటీనటులు వారి పాత్రలో మెప్పించారు.రొటీన్ గా అనిపించే కొత్త కథ . ధనరాజ్ డైరక్టర్ గా సక్సస్ అయ్యాడనే చెప్పాలి. స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. డైరక్టర్ గా ధనరాజ్ సక్సస్ అయ్యాడనే చెప్పొచ్చు. నటుడిగా దర్శకుడిగా రెండూ బాగా డీల్ చెయ్యగలిగాడు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news jabardasth

Related Articles