తెలంగాణలోనే ఒక కుగ్రామంలో గుప్త నిధులు నమ్మే జేసీబీ ఆపరేటర్ చంటి(రచ్చ రవి) తనకి దొరికిన బంగారు విగ్రహంతో సొంతంగా రెండు జేసీబీలు కొనేసి సెటిల్ అయ్యిపోవాలి అని ప్లాన్ చేస్తుంటాడు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ మూవీ బాపు ...ప్రమోషన్స్ తో వచ్చిన చిత్రం కూడా బాపు నే చిన్న సినిమాలా కనిపించే పెద్ద సినిమా . ఏ అంచనాలు లేకుండా చాలా సింపుల్ గా డిసెంట్ గా రిలీజ్ అయిన సినిమా . ఇక కథ విషయానికి వస్తే ...
తెలంగాణలోనే ఒక కుగ్రామంలో గుప్త నిధులు నమ్మే జేసీబీ ఆపరేటర్ చంటి(రచ్చ రవి) తనకి దొరికిన బంగారు విగ్రహంతో సొంతంగా రెండు జేసీబీలు కొనేసి సెటిల్ అయ్యిపోవాలి అని ప్లాన్ చేస్తుంటాడు. కాని అనుకోకుండా తన దగ్గర నుంచి ఆ బంగారు విగ్రహం మిస్ అయిపోతుంది. అదే ఊర్లో మల్లయ్య ( బ్రహ్మాజీ ) తన నాన్న రాజయ్య , భార్య సరోజ అలానే పిల్లలతో ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఓ పక్క చంటి నుంచి దూరమయిన బంగారు విగ్రహం ఏమయ్యింది . కష్టాల్లో ఉన్న మల్లయ్య కుటుంబం తమ ఇంటి పెద్ద రాజయ్యని ఎందుకు చంపాలనుకుంటుందనేది స్టోరీ.
నిజానికి ఈ చిన్నపాటి విలేజ్ స్టోరీలో ఇంట్రెస్టింగ్ థ్రిల్ ఎలిమెంట్స్ సాలిడ్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఒక ఇంట్రెస్టింగ్స్ స్టార్ట్ తో మొదలయ్యే ఈ చిత్రం అలా కొనసాగుతున్న కొద్ది డీసెంట్ ట్రీట్మెంట్ తో ముందుకు వెళుతుంది. కాని ఇంకా ఎంగేజింగ్ గా తీసే అవకాశాలున్నా ...డైరక్టర్ కాస్త తడబడ్డాడనే చెప్పాలి.. మనది కానిది మనకి అర్హత లేనిది మన దగ్గరకి రాదు ఈ పాయింట్ ను కామెడీ ..ఎమోషనల్ గా చూపించారు. నటుడు బ్రహ్మాజీ చాలా బాగా నటించారు. ఇక ఆమని , ధన్యబాలకృష్ణ, మణి ఎగుర్ల చాలా బాగా నటించారు.శ్రీనివాస్ అవసరాల తో పాటు బలగం యాక్టర్ సుధాకర్ తమ పాత్రలకు ప్రాణం పోశారు.
ఈ చిత్రంలో డీసెంట్ లైన్ ఉంది కానీ దీనిని ఇంకా ఎంగేజింగ్ గా డీల్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ పెద్ద గా మెప్పించలేదు. పైగా తన తండ్రినే హత మార్చాలి అనే పాయింట్ చాలా సిల్లీగా అనిపిస్తుంది. హీరో కి లవ్ ట్రాక్ ఉండాలి కాబట్టి పెట్టినట్టుంది. పాటలు ఇరికించినట్లు అనిపించాయి. అసలు లవ్ ట్రాక్ లేకుండా సినిమా నడిపించి ఉంటే బాగుండేదనిపించింది. నిజానికి కథ ఇంతకుముందు ఎక్కడో ఈ కథ విన్నంత దగ్గరగా ఉన్నా...కాసింత మార్చి మెప్పించారు. ఏ అంచనాలు లేకుండా సినిమాకు వెళ్తే మీకు సినిమా నచ్చుతుంది.