Rakhi Sawant: రాఖీ సావంత్ కు సమన్లు ..మహారాష్ట్ర సైబర్ సెల్ !

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కు మహారాష్ట్ర సైబర్ సెల్ సమన్లు పంపింది. ఈ నెల 27 న మహారాష్ట్ర సైబర్ సెల్ ముందు హాజరుకావాలనినోటీసుల్లో  పేర్కొంది.


Published Feb 21, 2025 05:37:00 PM
postImages/2025-02-21/1740139681_RakhiSawantIndiasGotLatent1.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: యూట్యూబర్ రణవీర్"  అల్హాబాదియా ఇండియాస్ గాట్ లాటెంట్ " షో లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపాయి. ఆయన పై చాలా కేసులు కూడా నమోదయ్యాయి. ఇదే కేసులో బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కు మహారాష్ట్ర సైబర్ సెల్ సమన్లు పంపింది. ఈ నెల 27 న మహారాష్ట్ర సైబర్ సెల్ ముందు హాజరుకావాలనినోటీసుల్లో  పేర్కొంది.


'ఇండియాస్ గాట్ లాటెంట్' వివాదాస్పద ఎపిసోడ్ లో రాఖీ సావంత్ పాల్గొనకపోయినప్పటికీ... గతంలో నిర్వహించిన ఎపిసోడ్లకు ఆమె అతిథిగా వచ్చారు. ఈ షోకి అతిధులుగా వచ్చిన అందరికపైనా సమన్లు జారీ చేసినట్లు తెలిపారు. నిర్మాతతో సహా ఫిబ్రవరి 24 న తమ ముందు విచారణకు హాజరుకావాలని ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చారు.


కేసు వివరాల్లోకి వెళితే... ఈ షోలో పాల్గొన్న ఒక వ్యక్తిని తల్లిదండ్రుల శృంగారం గురించి రణవీర్ ప్రశ్నించాడు. దీంతో, ఆయనపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. సెంట్రల్ నుంచి స్టేట్ వరకు ఈ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చాలా రాష్ట్రాల్లో ఎఫ్ ఐ ఆర్ లు నమోదయ్యాయి. సుప్రీంకోర్టు ఈ విషయంపై చాలా సీరియస్ అయ్యింది. ఇప్పటి వరకు ఉన్న కేసులు చాలు ఇక పైకేసులు వద్దని కూడా తెలిపింది.
 

newsline-whatsapp-channel
Tags : bollywood- maharastra rakhi cyber-security

Related Articles