ఐదుగురు డైవర్లు అరేబియా సముద్రగర్భంలో అన్వేషిస్తున్నారు. దీన్ని దశలవారీగా ముందుకు తీసుకెళ్తామని ఆర్కియాలజీ విభాగం అంటుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సముద్రంలో ద్వారకా నగరం మునిగిపోయిందని హిందూ పురాణాలు చెబుతాయి. ఆ నగర ఆనవాళ్ల కోసం ఇప్పటికి చాలా సార్లు పరిశోధనలు జరిగాయి. గుజరాత్ లోని ద్వారక తీరంలో ఇప్పుడు భారతపురావస్తు శాఖ టీమ్ మళ్లీ వెతుకులాట మళ్లీ అన్వేషణ ప్రారంభించింది. ఐదుగురు డైవర్లు అరేబియా సముద్రగర్భంలో అన్వేషిస్తున్నారు. దీన్ని దశలవారీగా ముందుకు తీసుకెళ్తామని ఆర్కియాలజీ విభాగం అంటుంది.
ఐదుగురు డైవర్లు అరేబియా సముద్రగర్భంలో అన్వేషిస్తున్నారు. దీన్ని దశలవారీగా ముందుకు తీసుకెళ్తామని ఆర్కియాలజీ విభాగం అంటుంది. దాదాపు 20 ఏళ్ల అనంతరం ఏఎస్ ఐ అనుబంధ విభాగం అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ ఈ అన్వేషణ ప్రారంభించడం గమనార్హం. ద్వారక హిందువుల ఏడు మోక్ష నగరాల్లో ఒకటి అని అంటారు.
అక్కడి నుంచి గోమతీ నదీ, అరేబియా సముద్ర సంగమ ప్రాంతానికి కృష్ణుడు వెళ్లి విశ్వకర్మ సాయంతో ఇక్కడే ద్వారక నగరాన్ని నిర్మిస్తాడు. ఆనగరం సముద్రంలో మునిగిపోయిందని హిందువుల విశ్వాసం. ద్వారక పై గతంలోనూ చాలా పరిశోధనలు జరిగాయి.అయితే 1969 నుంచి 1983, 1990 మధ్య సముద్ర గర్భంలో కొన్ని వస్తువులను గుర్తించారు. ద్వారక ఉందని ..అవశేషాలు దొరికాయని అప్పుడు అన్నారు. 2005-07 మధ్య యూఏడబ్ల్యూ సమక్షంలో ద్వారకా నగరంపై శోధన జరగగా, ఆ సముద్ర గర్భంలో ఓ నగరానికి సంబంధించిన గొప్ప నిర్మాణాలు ఉన్నాయని చెప్పారు.