"మా అమ్మకు ఆరోగ్యం బాగా లేదని, ఆమె ఆసుపత్రి పాలయ్యారంటూ వచ్చిన కొన్ని మీడియా కథనాలు నా దృష్టిలో పడ్డాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి అనారోగ్యం గా ఉందని ఆసుపత్రికి తరలించినట్లు వస్తున్న వార్తలపై చిరంజీవి స్పందించారు. దీనిపై ఇప్పటికే మెగా స్టార్ టీమ్ ఓ ప్రకటన వెలువరించింది. రీసెంట్ గా చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన తల్లికి ఆరోగ్యం బాలేదని వస్తున్న వార్తలపై అసహనం వ్యక్తం చేశారు.
"మా అమ్మకు ఆరోగ్యం బాగా లేదని, ఆమె ఆసుపత్రి పాలయ్యారంటూ వచ్చిన కొన్ని మీడియా కథనాలు నా దృష్టిలో పడ్డాయి. రెండు రోజులుగా కాస్త అస్వస్థతకు గురైనా...ఆసుపత్రికి తరిలించేంత పెద్దది కాదని ఇప్పుడామె చాలా బాగున్నారని ...ఎంతో హుషారుగా , హాయిగా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు. నేను మీడియా వాళ్లకు తెలియజేసేది ఒకటే దయచేసి ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ఊహాగానాలు పబ్లిష్ చెయ్యొద్దు. అర్ధం చేసుకుంటే సంతోషం అంటూ ట్వీట్ చేశారు.