టెక్నాలజీ పరంగా ఇప్పటికి ఇలాంటివి జరుగుతున్నాయా అనే క్వశ్చన్ మార్క్ ను ఫస్ట్ బీట్ లో వీడియోను ఆశ్చర్యమిస్తోంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘కలర్ ఫోటో’..తీసిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తర్వాత చిత్రం దండోరా ..మురళీ కాంత్ డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీ నుంచి మేకర్స్ ఫస్ట్ బీట్ పేరుతో వీడియో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అయితే గ్లింప్స్ ను గమనిస్తే అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిల ప్రేమించి పెళ్లి చేసుకున్న, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని దండోరా సినిమాను తెరకెక్కించారు. టెక్నాలజీ పరంగా ఇప్పటికి ఇలాంటివి జరుగుతున్నాయా అనే క్వశ్చన్ మార్క్ ను ఫస్ట్ బీట్ లో వీడియోను ఆశ్చర్యమిస్తోంది.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో మన పురాతన ఆచారాలు , సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, హాస్యం, ఎమోషన్స్ తో ఈ సినిమా ను ఆవిష్కరిస్తున్నారు. ఈ మూవీలో నటుడు శివాజీ తో పాటు నవదీప్ , నందు , రవికృష్ణ, మనీక , అనూష ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు మార్క్ కె . రాబిన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను మరికొన్ని రోజుల్లో అనౌన్స్ చేస్తారు.
A riveting tale of Love, Humor, Pride, and Culture! #Dhandoraa
![]()
Tags : newslinetelugu movie-news technology telangana