Kochi Airport: బెడిసికొట్టిన జోక్.. కటకటాల్లోకి తోసిన పోలీసులు!

కోజికోడ్ కు చెందిన రషీద్ అనే వ్యక్తి కౌలాలంపూర్ వెళ్లేందుకు బుధవారం రాత్రి కొచ్చిన్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు.


Published Feb 21, 2025 02:24:00 PM
postImages/2025-02-21/1740128128_metrovaarthaen20230867b105c4cd5d4a33bc6be9fc26ff0c1eCIAL.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అంతే మన టైం బాగోకపోతే ...ఏరా అబ్బాయ్ అన్నా ..ఏంట్రా వెధవాయ్ అంటారు. నోరు మంచిదైతే ...ఊరుకూడా మంచిదే అవుతుంది. ఏదో మేం కుర్రాళ్లం మేం ఏం చేసినా ..చెల్లుతుందని అంటే ఎలా ...కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయంలో భధ్రతా సిబ్బందితో ఓ ప్రయాణికుడు జోక్ చేశాడు. అధికారులు మాత్రం దానిని సీరియస్ గా తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాసేపు ఆగితే ..చక్కగా విదేశాల్లో నచ్చిన జీవితం ...కాని వెధవ జోక్ తో కటకటాలపాలయ్యాడు.


కోజికోడ్ కు చెందిన రషీద్ అనే వ్యక్తి కౌలాలంపూర్ వెళ్లేందుకు బుధవారం రాత్రి కొచ్చిన్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు. రాత్రి 11.30 గంటల ప్రాంతంలో సెక్యూరిటీ చెకప్ కు వెళ్లాడు. రషీద్ లగేజ్ చెక్ చెయ్యడంలో అధికారులు అడిగారట. రషీద్ లగేజీ చెక్ చేసిన భద్రతాధికారులు ఆయన బ్యాగుపై అనుమానం వ్యక్తం చేశారు. బ్యాగు చాలా బరువుంది ఏముందని అడగగా... బాంబ్ ఉంది అని అన్నాడట. దీంతో సెక్యూరిటీ ఆఫీసర్ సీరియస్ గా తీసుకొని అరెస్ట్ చేశారు.


దీనికి తిన్నగా సమాధానం చెప్పకుండా ‘లోపల బాంబ్ ఉంది’ అంటూ రషీద్ జోక్ చేశాడు. తాను జోక్ చేశానని రషీద్ భావించాడు . అతని లగేజీని బాగా చెక్ చేశాడని భద్రతా సిబ్బందికి అనుమానంగా ఉండే వస్తువులు కనిపించకపోయినప్పటికి  జోక్ చెయ్యడం వల్ల రషీద్ ను తీసుకెళ్లి , కాసేపు లాకప్ లో ఉంచి తర్వాత వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bomb-threat kerala

Related Articles